Phone Calls: మీ ఫోన్‌ కాల్స్‌ పక్కవాళ్లకు వెళ్తున్నాయా.. అయితే ఇలా చేయండి

తాజాగా సైబర్‌ నేరగాళ్లు మనకు తెలియకుండానే మన ఫోన్‌ కాళ్లును వేరేవాళ్లకు డైవర్ట్‌ చేసుకుని, అక్కడికిఇ కాల్‌ చేస్తున్నారు. ఓటీపీ వివరాలు కూడా డైవర్ట్‌ చేసి తెలుసుకుని డబ్బులు కాజేస్తున్నారు. దీంతో మనం ఎలాంటి వివరాలు చెప్పకుండానే మన బ్యాంకు ఖాతాలోని డబ్బులు కట్‌ అవుతున్నాయి.

Written By: Raj Shekar, Updated On : February 18, 2024 3:57 pm

Phone Calls

Follow us on

Phone Calls: సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ సైబర్‌ మోసాలూ పెరుగుతన్నాయి. ఆన్‌లైన్‌ మోసాలను తగ్గించడానికి టెక్నాలజీలో కొత్తకొత్త మార్పులు చేస్తుంటే.. సైబర్‌ నేరగాళ్లు కూడా అంతే అప్‌డేట్‌ అవుతున్నారు. ప్రధానంగా ఆనడ్రాయిడ్‌ ఫోన్లు వచ్చిన తర్వాత ఈ సైబర్‌ నేరాలు బాగా పెరగుతున్నాయి. ఖాతాల్లోని డబ్బులు మాయమవడం, ఆన్‌లైన్‌ గేమ్స్‌ పేరిట డబ్బులు కాజేయడం, మనకు తెలియకుండానే మన బ్యాంకు డీటెయిల్స్‌ తెలుసుకోవడం, ఓటీపీ తెలుసుకుని డబ్బులు తమ ఖాతాల్లోకి మళ్లించకోవడం వంటివి జరుగుతున్నాయి.

మరో కొత్తరకం మోసం..
తాజాగా సైబర్‌ నేరగాళ్లు మనకు తెలియకుండానే మన ఫోన్‌ కాళ్లును వేరేవాళ్లకు డైవర్ట్‌ చేసుకుని, అక్కడికిఇ కాల్‌ చేస్తున్నారు. ఓటీపీ వివరాలు కూడా డైవర్ట్‌ చేసి తెలుసుకుని డబ్బులు కాజేస్తున్నారు. దీంతో మనం ఎలాంటి వివరాలు చెప్పకుండానే మన బ్యాంకు ఖాతాలోని డబ్బులు కట్‌ అవుతున్నాయి.

స్కామర్స్‌కు కాల్స్, ఓటీపీలు..
మన కాల్స్, ఓటీపీ, ఎస్‌ఎంఎస్‌లు వేరేవాళ్లకు స్కామర్స్‌ ఫార్వార్డ్‌ చేస్తున్నారు. ఇలా అవుతున్నట్లు గుర్తించినా.. డౌట్‌ ఉన్నా మీరు వెంటనే డయల్‌ ప్యాడ్‌ ఓపెన్‌ చేసి *#67# కి డయల్‌ చేయండి. వెంటనే మీ ఫోన్‌ నంబర్‌ స్కామర్ల చేతికి వెళ్లిందో లేదో తెలుస్తుంది. మీకాల్స్‌ వార్వార్డ్‌ అవుతున్నట్లు మెసేజ్‌ వస్తుంది.

ఇలా డీయాక్టివ్‌ చేయండి..
మీ కాల్‌ డైవర్ట్‌ యాక్టివ్‌లో ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే డీయాక్టివ్‌ చేసుకోండి. మళ్లీ డయల్‌ ప్యాడ్‌ ఓపెన్‌ చేసి #002# కి డయల్‌ చేయండి. వెంటనే మీకు కింద సర్వీస్‌ హాస్‌ బీన్‌ డిజబుల్‌ అని మెసేజ్‌ వస్తుంది. దీంతో డీయాక్టివ్‌ అయిపోతుంది. దీంతో మీ కాల్స్‌ పక్కవాళ్లకు వెళ్లవు. మీ డబ్బులు సేఫ్‌గా ఉంటాయి. మీ వ్యక్తిగత వివరాలు కూడా రహస్యంగా ఉంటాయి.