Instagram: కాలం మారుతున్న కొద్దీ సాంకేతికత పెరిగిపోతుంది. దీంతో ప్రతీ రంగంలో టెక్నాలజీని ఉపయోగించి పనులను ఈజీగా చేసుకుంటున్నారు. ఒక రకంగా టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతున్నా.. దీనిని ఆసరాగా చేసుకున్న కొందరు దారుణ మోసాలకు పాల్పడుతున్నారు. ఫైనాన్సియల్ గానే కాకుండా జీవితాలతో ఆటాడుతన్నారు. వినియోగదారులను అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎన్నో యాప్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఈ తరుణంలో కొన్ని డీప్ ఫేక్ యాప్ లు కూడా పుట్టుకొస్తున్నాయి. ఈ యాప్ ల ద్వారా ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు సృష్టిస్తున్నారు. ఈ విషయంలో కాస్త ఏమారపాటుగా ఉండడంతో ప్రాణాలకే ముప్పు ఏర్పడే పరిస్థితి ఏర్పడుతోంది.
గత కొన్ని రోజులుగా సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. చాలా మంది తమకు తెలియకుండానే కొన్ని తప్పులు జరుగుతున్నాయని బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల ఓ యువతి పెళ్లి నిశ్చయమైంది. అంతకుముందు ఆమె తన పర్సనల్ ఫొటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. అయితే ఈమెను ఇష్టపడిన ఓ యువకుడు డీప్ ఫేక్ యాప్ ద్వారా ఆమె ఫేస్ తో నగ్న చిత్రాలను తయారు చేసి.. పెళ్లి చేసుకోబోయే వరుడికి పంపించాడు. దీంతో ఆ ఫొటోలు, వీడియోలను చూసిన వ్యక్తి పెళ్లి రద్దు చేసుకున్నాడు. అయితే తానేం తప్పు చేయలేదని, ఇది ఎవరు చేశారో తెలియదని అమె పోలీసులను ఆశ్రయించింది. టెక్నాలజీని ఉపయోగించి పోలీసులు అది గుర్తు తెలియని వ్యక్తి చేసిన పనే అని గుర్తించారు.
మరికొందరు గొంతును మార్చి తమ బంధువుల్లా మాట్లాడుతూ డబ్బులు అడుగుతున్నారు. ఇది నిజమే కావచ్చు అనుకొని వెంటనే వారికి డబ్బులు పంపిస్తున్నారు. వాస్తవ విషయం తెలసుకున్న తరువాత లబోదిబో మంటున్నారు. ఇలాంటి విషయాల్లో పోలీసులు హెచ్చరిస్తున్నా.. చాలా మంది అవగాహన లేకపోవడంతో సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. సోషల్ మీడియాలో పర్సనల్ ఫొటోలు పెట్టిన వారివి వారికి తెలియకుండానే అసభ్యకరంగా తయారు చేస్తూ ప్రచారం చేస్తున్నారు.
ఈ విషయంలో జాగ్రత్తలు పాటించకపోతే మొదటికే మోసం అవుతుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసే మహిళలు తమ ప్రొఫైల్ ను లాక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. వీలైతే పర్సనల్ కు సంబంధించినవి పోస్టు చేయకపోవడమే మంచిదని అంటున్నారు. ఇటీవల ఇలా ఫేస్, స్వరం మార్చే యాప్ లను లక్షల కొద్దీ డౌన్లోడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. వీటి ద్వారా మోసాలకు పాల్పుడుతూ ఎదుటి వాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నారు.