
Telangana Secretariat: దేశం అబ్బురపడేలా కేసీఆర్ హైదరాబాదులో కొత్త సెక్రటే రియట్ నిర్మిస్తున్నాడు. దీన్ని తట్టుకోలేక ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇది ముమ్మాటికి తెలంగాణ పైన దాడే.. దేశం మొత్తం అబ్బురపడేలా ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి కేసీఆర్ దేనిని అంగరంగ వైభవంగా ప్రారంభిస్తారు.. ఇదీ ఆ మధ్య నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చిన ఓ వార్త. కానీ ఇప్పుడు ఆ సెక్రటేరియట్ ప్రస్తావన నమస్తే తెలంగాణలో రావడం లేదు. దాని ప్రారంభోత్సవానికి సంబంధించి కూడా ఉలుకు పలుకు లేదు.. అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తే.. మొన్న జరిగిన అగ్ని ప్రమాదంలో సచివాలయం గ్రౌండ్ ఫ్లోర్ దెబ్బతిన్నది. దాని మరమ్మతులకే చాలా సమయం పడుతుందని వినికిడి. అందుకే దాని ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారని టాక్.
Also Read: Kethamreddy Vinod Reddy: మొన్న మహాసేన రాజేశ్.. నేడు కేతం రెడ్డి.. జనసేన నుంచి టీడీపీ లాగేస్తోందా?
సెక్రటేరియట్ పనులు కోవిడ్ సమయంలోనే ప్రారంభమయ్యాయి.. ఇప్పటికే మూడు సంవత్సరాలు గడిచిపోయాయి.. ఇంకా పనులు పూర్తి కాలేదు. కానీ ఢిల్లీలో చక్రాలు తిప్పాలని, మోదీని గద్దె దించాలని కెసిఆర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు..అల్ రెడీ ఖమ్మంలో భారీ సభ పెట్టాడు.. అనుకున్నంత ఫాయిదా దక్కలేదు. దీంతో ఈసారి ఫిబ్రవరి 17 తన జన్మదినం సందర్భంగా కొంతమంది వివిధ రాష్ట్రాల ప్రతినిధులను పిలిచి అట్టహాసంగా సెక్రటేరియట్ ప్రారంభిద్దాం అనుకున్నాడు. ఇక ఇతర రాష్ట్రాల పత్రికలకు జాకెట్ యాడ్స్ కూడా. అయితే ఆయన ఒకటి తెలిస్తే దైవం ఒకటి తలిచింది.. కాకపోతే ఫిబ్రవరి 17 కెసిఆర్ జన్మదినం అని ప్రతి ఒక్కళ్ళకు తెలిసిపోయింది. కెసిఆర్ టార్గెట్ కూడా ఇదే.
ఇక సెక్రటేరియట్ ప్రారంభోత్సవం వాయిదా పడటానికి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డంకి అని భారత రాష్ట్ర సమితి నాయకులు చెబుతున్నారు.. వారు చెప్పిన దాని ప్రకారం ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఫిబ్రవరి 17 సాయంత్రం నుంచి అమల్లోకి వస్తుంది.. ముందే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 17 ఉదయం 10 గంటలకు సెక్రటేరియట్ ఓపెనింగ్ చేయాలని అనుకున్నారు. తర్వాత సభ కూడా పెట్టాలని నిర్ణయించారు.. కానీ ఇక్కడ సెక్రటేరియట్ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం దెబ్బ తినడం, పనులు ఇంకా ఒక కొలిక్కి రాకపోవడంతో దాని ఓపెనింగ్ వాయిదా వేసినట్టు తెలుస్తోంది..

బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నట్టు ఎలక్షన్ కోడ్ గనక అడ్డంకిగా ఉంటే.. గతంలో ఉప ఎన్నికలు జరిగినప్పుడు ఇదే నమస్తే తెలంగాణ, పింక్ మేధావులు గొర్రెల పంపిణీ కి, ఇతర ఇతర పథకాలను లబ్ధిదారులకు అందనీయకుండా ప్రతిపక్ష పార్టీలు గాయి గాయి చేస్తున్నాయని ఆరోపించారు.. కానీ ఇప్పుడు ఏ ప్రతిపక్ష పార్టీ అడ్డుపడిందని సెక్రటేరియట్ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తున్నారో చెప్పడం లేదు. మొన్నటికి మొన్న అగ్నిప్రమాదం జరిగినప్పుడు సకాలంలో ఫైర్ ఇంజన్లు వెళ్లేందుకు అక్కడ సరైన దారి లేదని అగ్నిమాపక శాఖ అధికారులు అంటున్నారు. రేపటి నాడు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు? ఆ సౌకర్యాలు లేవనే కదా పాత సచివాలయాన్ని కులగొట్టింది? మరి ఇన్ని కోట్లు పెట్టి కడుతున్న కొత్త సచివాలయంలో కల్పిస్తున్న సౌకర్యాల మాటేమిటి? కనీసం ఫైర్ ఇంజన్లు కూడా వెళ్లే దారి లేకపోతే ఎలా? దాన్ని ఇంజనీరింగ్ నైపుణ్యం అని ఎలా అభివర్ణించుకుంటారు? ఇలా తవ్వుకుంటూ పోతే ఎన్నో ప్రశ్నలు. బహుశా కెసిఆర్ దేశానికి అందిస్తున్న గుణాత్మక మార్పు అంటే ఇదేనేమో..
Also Read: Kanna Lakshminarayana: అటు తిరిగి.. ఇటు తిరిగి కన్నా అడుగులు అటువైపు..