
Kotamreddy Sridhar Reddy: నిజ జీవితంలో ఎవరైనా సహజంగా నటిస్తే వారికి కమల్ హాసన్ అనే బిరుదిస్తాం.. ఇక రాజకీయాల్లో అయితే… చెప్పాల్సిన పని లేదు.. అందరూ మహానటులే..బ్లడ్ అండ్ బ్రీడ్ నుంచి మాట తప్పం మడప తిప్పం అనే పంచ్ డైలాగులు సరేసరి. ముందుగానే చెప్పినట్టు రాజకీయ నాయకులు అంటే మహానటులు కాబట్టి… వారికి పదవి కావలసినప్పుడు ఒక తీరుగాను… ఇక పదవి ఎప్పటికీ దక్కదు అనుకున్నప్పుడు మరొక రకంగా ఉంటారు. అంతిమంగా పదవే ఇంపార్టెంట్ కాబట్టి దాని ఆధారంగానే వారి ఆలోచనలు సాగుతుంటాయి.. బేసిగ్గా మనిషి ఆశాజీవి కాబట్టి ఆశలు పెంచుకోవడంలో తప్పులేదుగా. కానీ ఆ ఆశలు దురాశలయితేనే అసలు ఇబ్బంది.. ఇక ప్రస్తుతం అలాంటి ఆశాభంగం అయిన వారిలో నెల్లూరు రూరల్ జిల్లా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకరు.
Also Read: Telangana Secretariat: సచివాలయం ప్రారంభోత్సవం ఆగిపోవడానికి అసలు కారణాలు ఇవా?
ఈయన మొదటినుంచి జగన్మోహన్ రెడ్డిని అంటిపెట్టుకొని ఉన్నారు. మొదటి దశలో తనకు మంత్రి పదవి వస్తుంది అనుకుంటే అనిల్ కుమార్ యాదవ్ ఎగరేసుకుపోయారు. రెండవ దశలో కాకాని గోవర్ధన్ రెడ్డి తిష్ట వేసుకున్నారు. అధినేతను కలిస్తే పెద్దగా ఫాయిదా దక్కలేదు. ఏముంది వెంటనే ప్లేటు ఫిరాయించాడు.. టిడిపి ఫోల్డ్ లోకి వెళ్లిపోయాడు.. దానికి సంకేతం గానే ఏబీఎన్ ఎండి రాధాకృష్ణకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు.. దీనికి తగ్గట్టుగానే వైయస్ జగన్మోహన్ రెడ్డి తన గన్మెన్లను తగ్గించాడు. కానీ ఇన్నాళ్లు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోణంలో మాత్రమే పచ్చ మీడియా వార్తలు రాసింది.. ఇప్పుడు అధికార పార్టీ వంతు వచ్చింది.. ఇప్పుడు అది కూడా కోటంరెడ్డి అసలు కోణాన్ని చూపిస్తోంది. తన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అహో ఓహో అని రాసింది. ఇప్పుడు మాత్రం సంచలన విషయాలు బయటపెడుతోంది.

ఇక శ్రీధర్ రెడ్డి ఇటీవల ఓ వెబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.. అందులో కొన్ని ప్రశ్నలకు సమాధానం దాటవేశారు. ముఖ్యంగా ఓ భూ వివాదానికి సంబంధించి న్యాయం చేయాలని ఓ మహిళ శ్రీధర్ రెడ్డి వద్దకు వస్తే… దానిని అతని తమ్ముడు గిరిధర్ రెడ్డికి అప్పగించాడు.. ఈ పంచాయతీని సెటిల్ చేయకుండా ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమె భూమిని తన పేర రాయించుకున్నాడు. దీనిపై ఆ బాధితురాలు ఎమ్మెల్యే మీద కారాలు మిరియాలు నూరుతున్నారు.. అంతేకాదు ఐదు కోట్ల విలువ చేసే స్థలాన్ని అప్పనంగా రాయించుకున్నారని శాపనార్ధాలు పెడుతున్నారు.. ఇక ఆ సదరు రియల్టర్ కూడా ఎమ్మెల్యే చెప్తేనే ఆ భూమిని రాసి ఇచ్చానని చెబుతున్నాడు.. సదరు బాధితురాలి సంతకాలు లేకుండా భూమి ఎలా రిజిస్ట్రేషన్ చేశారనేది ఇక్కడ ప్రశ్న.. అంటే అధికార పార్టీకి వ్యవస్థ ఎలా సాగిల పడుతుందో అర్థం చేసుకోవచ్చు.. అంతేకాదు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పేవన్ని నిజాలు కావని, ఆయన కోటంరెడ్డి కమల్ హాసన్ అని గమనించవచ్చు.. ఒకవేళ ఇదే కోటంరెడ్డి గనుక అధికార పార్టీలో ఉంటే పచ్చ మీడియా వ్యతిరేకంగా వార్తలు రాసేది. అధికార పార్టీ మీడియా మా ఎమ్మెల్యే గొప్పోడు అని చాటింపు వేసేది.. కానీ ఇక్కడ ప్రాధాన్యాలు మారాయి.. వార్తలు కూడా మారాయి.
Also Read:Kanna Lakshminarayana: అటు తిరిగి.. ఇటు తిరిగి కన్నా అడుగులు అటువైపు..