Monkeys: తెలివైన జంతువుల్లో కోతులు ఒకటి. వాటి చేష్టలు మనిషికి దగ్గరగా ఉంటాయి. మనుషులు మాదిరిగానే చాలా విషయాలు నేర్చుకోగలవు కూడా. చింపాంజీలు మరియు గొరిల్లాలు వంటి కోతి జాతులు అత్యంత తెలివైనవని పరిశోధనలో తేలింది. అయితే కోతి జాతులు గుంపులు గుంపులుగా ఉండేందుకే ఇష్టపడతాయని.. ఐక్యంగా ఉంటాయని తెలుస్తోంది.
ఇంచుమించు మనిషికి ఉన్న ప్రత్యేకతలు సైతం కోతులకు ఉంటాయి. వాటికి మనుషుల మాదిరిగానే బొటన వేలు ఉంటుంది. ఆ వేలుతోనే మనిషి మాదిరిగా అన్నింటినీ పట్టుకుంటాయి. మనిషికి బొటనవేలు ఉండడం వల్లే మానవజాతి అభివృద్ధి చెందిన విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తు చేస్తున్నారు. ఈ బొటనవేలు సాయంతోనే కోతులు సులభంగా చెట్లు ఎక్కగలుగుతున్నాయి. మనుషులు మాదిరిగానే కోతులు సాధనాలను ఉపయోగించగలవు. చెక్కలను ఉపయోగించి చెట్ల నుంచి పండ్లు తీయగలవు. మనిషితో సమానమైన ఆలోచన సామర్థ్యం కోతులకు ఉంటుందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు.
కోతులు సామాజిక జంతువులుగా ఉన్నా.. వాటికి స్వతంత్ర భావాలు అధికం. ముఖ్యంగా ఆటలు ఆడుతాయి. ఒకదానితో ఒకటి ఆడుకుని కనిపిస్తాయి. ఈ క్రమంలో అవి చురుగ్గా కనిపించడమే కాదు.. చుట్టుపక్కల ఉన్న విషయాలను ఆసక్తిగా గమనిస్తాయని.. కొత్త విషయాలపై చాలా ఆసక్తి చూపుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చెట్లు, పర్వతాలను ఎక్కడానికి కూడా చురుగ్గా ఉంటాయి.. చాలా దూరం దూకగలవు. ఈ విషయంలో స్పైడర్ కోతులు ముందంజలో ఉన్నాయి. దాదాపు 15 అడుగుల పొడవు ఇవి దూకగలవు. అటు కోతులు ఆహారం విషయంలో కూడా ప్రత్యేకత ఉంటుంది. కేవలం పండ్లు మాత్రమే తింటాయని తెలుసు. కానీ కొన్నిసార్లు జంతువుల మాంసాన్ని కూడా తింటాయని పరిశోధనలో తేలింది. అవి తినే ఆహారం బట్టి అనేక వాతావరణంలో జీవించగల సామర్థ్యాన్ని సొంతం చేసుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 260 రకాల కోతుల జాతులు ఉన్నట్లు తేలుతోంది. మిగతా జంతువులకు అందనంత రీతిలో కోతులు తమ నివాసాలను ఏర్పాటు చేసుకుంటాయి. ముఖ్యంగా దోపిడీ జంతువుల విషయంలో అన్ని రకాల జాగ్రత్తలను తీసుకుంటాయి. అటు తమ దేహ సౌందర్యం విషయంలో సైతం కోతులు ప్రత్యేక దృష్టి పెడతాయి. శుభ్రతను పాటిస్తాయి. మనుషులు మాదిరిగా దుస్తులు ధరించుకోవాలన్న కోరిక వాటిలో అధికమని పరిశోధనలో తేలడం విశేషం. మొత్తానికైతే కోతి చేష్టలు మాదిరిగానే వాటి ప్రత్యేకతలు కూడా అధికమని పరిశోధనల్లో తేలింది.