https://oktelugu.com/

Car Loan Rules : కొత్త కారు కొనేవారికి షాక్.. ఈ రూల్స్ మారాయి.. వెంటనే తెలుసుకోండి..

ఫైనాన్స్ ద్వారా కారు కొనుగోలు చేయాలనుకునేవారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బీ ఐ) కొత్త రూల్స్ పెట్టింది. గతంలో ఎవరైనా కారు కొనుగోలు చేయాలనుకుంటే ఎంత రుణమైనా తీసుకోవచ్చు. కానీ..

Written By:
  • Srinivas
  • , Updated On : January 31, 2024 9:34 am
    car loan rules

    car loan rules

    Follow us on

    Car Loan Rules : కారు కొనుగోలు చేయాలని ప్రతి ఒక్కరూ కల కంటారు. కానీ ఈ కలను కొందరు మాత్రమే నెరవేర్చుకుంటారు. ఉద్యోగులు, వ్యాపారులు ఎవరైనా తమ బడ్జెట్ ను దృష్టిలో ఉంచుకొని కారును కొనుగోలు చేస్తారు. అయితే నెల నెలా ఆదాయం వచ్చేవారు లోన్ ద్వారా కారు కొనాలనుకుంటారు. ఈఎంఐ ద్వారా కారు రుణం చెల్లిస్తూ ఆ వాహనాన్ని వినియోగిస్తారు. అయితే ఫైనాన్స్ ద్వారా కారు కొనుగోలు చేయాలనుకునేవారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బీ ఐ) కొత్త రూల్స్ పెట్టింది. గతంలో ఎవరైనా కారు కొనుగోలు చేయాలనుకుంటే ఎంత రుణమైనా తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు అలా కొనుగోలు చేయలేరు. ఎందుకంటే?

    నేటి కాలంలో కొందరు పరిమితికి మించి ఖర్చులు చేస్తున్నారు. ఆదాయం లేకున్నా హోదా కోసం కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. ఇందులో కారు కూడా ఒకటి ఉంది. కార్లలో తిరగాలని కోరిక ఉన్నందున లోన్ ద్వారా కొనుగోలు చేసి నెరవేర్చుకుంటున్నారు. అయితే ఈఎంఐ చెల్లించడానికి ఆదాయం సరిపోకపోవడంతో అప్పుల పాలవుతున్నారు. కార్ల సేల్స్ పెంచుకోవడానికి కొన్నిఫైనాన్స్ కంపెనీలు సైతం కొనుగోలుదారుల ఆదాయంతో సంబంధం లేకుండా రుణాలను ఇచ్చాయి. కానీ చాలా మంది రుణ భారం పెరిగి వాటిని చెల్లించడం లేదు.

    ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆర్బీఐ ప్రత్యేక రూల్స్ పెట్టింది. కారు కొనుగోలు చేసే క్రమంలో పరిమిత వ్యక్తులకు మాత్రమే రుణం సాయం అందిచాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కారు కొనుగోలు చేసే వ్యక్తుల ఆదాయాన్ని భట్టి మాత్రమే రుణ సాయం చేస్తారు. ఆదాయం తక్కువగా ఉన్న వారికి రుణ సాయం ఇవ్వడానికి ముందుకు రారు. కొనుగోలుదారుల ఆదాయంలో 20 శాతం డౌన్ పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. నెలవారి ఆదాయంలో 10 శాతం మించకుండా ఈఎంఐ చెల్లించే విధంగా ఉండాలి. అలాగే రుణ గడువు 4 సంవత్సారాల లోపే పరిమితి ఉండాలి.

    ఒక వ్యక్తి కారు కొనుగోలు చేయడానికి రుణం తీసుకున్నాడనుకుందాం. అతడు డౌన్ పేమేంట్ 20 శాతం అంటే.. ఒక కారుకు రూ.6 లక్షలు అనుకుందాం. ఇందులో 1.2 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లించాలి. మిగతా మొత్తాన్ని బ్యాంకులు లేదా ఫైనాన్సియల్ ద్వారా రుణ సాయం చేస్తారు. అలాగే నెలవారి ఈఎంఐ రూ.10 వేల లోపు మాత్రమే ఉండాలి. కారు కొనుగోలు చేసేవారికి బ్యాంకులు 7 నుంచి 8 శాతం వడ్డీతో రుణాన్ని అందిస్తున్నాయి. అయితే ఈ వడ్డీ రేటుతో 4 సంవత్సరాలలోపు మాత్రమే టెన్యూర్ ఎంపిక చేసుకోవాలి. ఈ రూల్స్ కు అనుగుణంగా మాత్రమే కార్ల కొనుగోలుదారులకు రుణాన్ని అందిస్తున్నారు.