
A. R. Rahman: భారతదేశ ప్రభుత్వం ద్వారా ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ కి ఎందుకు పనికిరాని ‘చల్లో షో’ ని పంపినందుకు తీవ్రమైన విమర్శలు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.దేశ వ్యాప్తంగా #RRR సినిమా ప్రభంజనం సృష్టించి అంతర్జాతీయ స్థాయి లో గుర్తింపు తెచ్చుకున్న #RRR సినిమాని ప్రభుత్వం ద్వారా ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ కి పంపించి ఉంటే మరో రెండు క్యాటగిరీలలో నామినేషన్స్ దక్కించుకొని రెండు ఆస్కార్ అవార్డ్స్ గెలుచుకునే అవకాశం ఉండేది అని ఎంతో మంది విశ్లేషకులు తమ అసహనం ని వ్యక్తపరిచారు.
రీసెంట్ గా ఆస్కార్ అవార్డు గ్రహీత AR రెహ్మాన్ తన యూట్యూబ్ ఛానల్ లో లెజెండ్ L సుబ్రహ్మణ్యం తో కాసేపు చర్చాగోష్ఠి జరిపాడు.ఈ చిట్ చాట్ లో వీళ్లిద్దరు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ లో జరుగుతున్నా మార్పుల గురించి, పరిణీతి చెందుతున్న సంగీతం గురించి ఎన్నో విశేషాలను చర్చించుకున్నారు.
ఈ మీటింగ్ లో AR రెహ్మాన్ ఆస్కార్ అవార్డ్స్ పట్ల మన ఇండియన్ ఫిలిం ఫెడరేషన్ వ్యవహరిస్తున్న తీరు గురించి మండిపడ్డాడు.ఆయన మాట్లాడుతూ ‘ఈమధ్య ఆస్కార్ అవార్డ్స్ కి విషయం లేని సినిమాలను నామినేషన్స్ కోసం పంపుతున్నారు, అవేమో తిరిగి వెనక్కి వచ్చేస్తున్నాయి.మనం దీని గురించి ఏమి చేయలేము, అలా చూస్తూ ఉండడం తప్ప.అర్హత ఉన్న సినిమాలను నామినేషన్స్ కి పంపిస్తే అత్యధిక ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ దక్కించుకొని, అవార్డ్స్ పొందేవాళ్ళం’ అంటూ రెహ్మాన్ ఈ సందర్భంగా మాట్లాడాడు.

ఆయన మాట్లాడిన మాటలు #RRR చిత్రానికి పరోక్ష మద్దతు ప్రకటించినట్టు తెలుస్తుంది.’బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ క్యాటగిరీ ఆస్కార్ అవార్డుని గెలుపొందిన #RRR చిత్రం , ఇండియన్ ప్రభుత్వం ద్వారా నామినేషన్స్ కి పంపి ఉంటే మరో అవార్డు వచ్చే అవకాశం ఉండేదని ఆయన అభిప్రాయం.రెహ్మాన్ కామెంట్స్ కి సోషల్ మీడియా నుండి సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది.