Minister Roja Dance: ఏపీ మంత్రి రోజా మరోసారి పాత రోజులు గుర్తు చేశారు. కళాకారులతో కలిసి డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. స్టేజీపై అందరిముందే మంత్రి అన్న విషయాన్ని మరిచి ఆడిపాడారు. ఆకట్టుకునే స్టెప్పులతో అదరగొట్టారు. సినీ రంగం నుంచి వచ్చిన రోజా డాన్స్ లో మంచి ప్రావీణ్యం ఉంది. మొన్నటి వరకు పలు ప్రోగ్రామ్స్ లో స్టెప్పులు వేసిన రోజా మంత్రి అయిన తరువాత అవన్నీ మానుకున్నారు. అయితే తాజాగా జగనన్న స్వర్ణోత్సవాలను పురస్కరించుకొని ఆమె చేసిన డ్యాన్స్ పలువురిని ఆకట్టుకుంది. దీంతో అక్కడున్న చాలా మంది ఆ సీన్ ను కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. కొద్ది సేపట్లోనే ఈ వీడియో వైరల్ అవడం విశేషం.

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినం వచ్చే నెలలో జరగనుంది. ఇందులో భాగంగా రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసినట్లు ఈ శాఖ బాధ్యులు రోజా తెలిపారు. ఈ వేడుకలను తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరైన మంత్రి రోజా అక్కడి కళాకారుల డ్యాన్స్ చూసి ఫుల్ ఖుషీ అయ్యారు. దీంతో వెంటనే స్టేజీపై తాను కూడా వారితో కలిసి డ్యాన్స్ చేయడం మొదలెట్టారు. చీరకట్టులో కూడా రోజా అదిరే స్టెప్పులు వేసి పలువురిని ఆకట్టుకున్నారు. రోజా చేసిన డ్యాన్స్ వీడియోలను కొందరు సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అవి ఇప్పుడు వైరల్ గా మారాయి.
“మన ప్రాచీన సంస్కృతి సాంప్రదాయ కళలను భావితరాలకు అందించడమే లక్ష్యంగా ఒక కళాకారునిగా కళాకారులకు అండగా ఉంటానని వారి అభివృద్ధికి కృషిస్తానని మాట ఇస్తున్నా..“ #YSJaganMarkGovernance pic.twitter.com/cfUlBEIeQ3
— Roja Selvamani (@RojaSelvamaniRK) November 19, 2022
అయితే రోజా సినిమా పాటలు కాకుండా బంజార డ్యాన్స్ చేసిన ఆకర్షించారు. కళాకారులతో సమానంగా మంత్రి డ్యాన్స్ చేయడం షాక్ తెప్పించింది. రోజా డ్యాన్స్ చేస్తున్న సమయంలో యూత్ కేరింతలతో సందడి చేశారు. గిరిజన సంప్రదాయమైన బంజారా, థింసా డాన్స్ చేసిన రోజా వీడియోలు వైరల్ అవుతున్నాయి. రోజాతో పాటు కళాకారులు అదిరే స్టెప్పులు వేసి అక్కడున్న ప్రేక్షకులను అలరించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ కులమతాలకతీతంగా సంక్షేమం అందిస్తున్న జగన్ సంక్షేమ సామ్రాట్ అని అన్నారు. అలాగే ప్రతిపక్ష పార్టీలపై రోజా విమర్శలు కురిపించారు.

జగనన్న స్వర్ణోత్సవాలను ఈనెల 19 నుంచి డిసెంబర్ 9 వరకు నిర్వహించనున్నట్లు మంత్రి రోజా తెలిపారు. తిరుపతి జోన్ లో 19 నుంచి 21 వరకు, గుంటూర్ జోన్ లో 24,25,26 తేదీల్లో, రాజమండ్రి జోన్ లో 29, 30 వరకు నిర్వహించనున్నామన్నారు. అలాగే విశాఖ జోన్ వారికి డిసెంబర్ 7,8,9 తేదీల్లో పోటీలు ఉంటాయన్నారు. చివరిసారిగా రాష్ట్రస్థాయి పోటీలను డిసెంబ్ 19,20 తేదీల్లో విజయవాడలో నిర్వహిస్తామని రోజా పేర్కొన్నారు. ఈ పోటీల్లో పాల్గొన్న వారికి, విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు ఉంటాయన్నారు.

[…] Also Read: Minister Roja Dance: అందరి ముందు ఆ పనిచేసిన మంత్రి… […]