Anupama Parameswaran : సైడ్ యాంగిల్ నుండి యద అందాలు చూపిస్తూ… తెగించిన హోమ్లీ బ్యూటీ అనుపమ!

Anupama Parameswaran : అనుపమ కెరీర్ కొంచెం గాడిన పడిన సూచనలు కనిపిస్తున్నాయి. 2022లో ఏకంగా ఐదు చిత్రాలు విడుదల చేసింది. అంటే సుందరానికీ మూవీలో చిన్న క్యామియో రోల్ చేశారు. రౌడీ బాయ్స్ సంక్రాంతి కానుకగా విడుదలైంది. తన ఇమేజ్ కి భిన్నమైన రోల్ ట్రై చేసింది. కొంచెం బోల్డ్ సీన్స్ లో నటించారు. రౌడీ బాయ్స్ పర్లేదు అనిపించుకుంది. ఇక కార్తికేయ 2తో బ్లాక్ బస్టర్ కొట్టింది. బహుశా అనుప కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అని […]

Written By: NARESH, Updated On : February 4, 2023 8:40 pm
Follow us on

Anupama Parameswaran : అనుపమ కెరీర్ కొంచెం గాడిన పడిన సూచనలు కనిపిస్తున్నాయి. 2022లో ఏకంగా ఐదు చిత్రాలు విడుదల చేసింది. అంటే సుందరానికీ మూవీలో చిన్న క్యామియో రోల్ చేశారు. రౌడీ బాయ్స్ సంక్రాంతి కానుకగా విడుదలైంది. తన ఇమేజ్ కి భిన్నమైన రోల్ ట్రై చేసింది. కొంచెం బోల్డ్ సీన్స్ లో నటించారు. రౌడీ బాయ్స్ పర్లేదు అనిపించుకుంది. ఇక కార్తికేయ 2తో బ్లాక్ బస్టర్ కొట్టింది. బహుశా అనుప కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అని చెప్పొచ్చు. హీరో నిఖిల్ నటించగా చందూ మొండేటి సోసియో ఫాంటసీ చిత్రంగా రూపొందించారు.

కార్తికేయ 2 హిందీలో కూడా విజయం సాధించి పాన్ ఇండియా హిట్స్ ఖాతాలో చేరింది. సరైన హిట్ లేక అల్లాడుతున్న అనుపమకు కార్తికేయ 2 మెమరబుల్ మూవీగా నిలిచిపోయింది. నిఖిల్-అనుపమ 18 పేజెస్ మూవీతో కాంబినేషన్ రిపీట్ చేశారు. కార్తికేయ ఫీవర్ తగ్గక మునుపే 18 పేజెస్ థియేటర్స్ లోకి వచ్చింది. మంచి చిత్రంగా పేరు తెచ్చుకున్న 18 పేజెస్ కమర్షియల్ గా ఆడలేదు. అయితే నిర్మాతలకు లాభాలు తెచ్చినట్లు ప్రచారం జరిగింది.

అనంతరం బటర్ ఫ్లై టైటిల్ తో థ్రిల్లర్ విడుదల చేశారు. ఈ చిత్రం నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులోకి వచ్చింది. బటర్ ఫ్లై గురించి జనాల్లో పెద్దగా చర్చ జరగలేదు. ఎంత పెద్ద హిట్ అయినా… ఓటీటీ మూవీ అంటే ప్రేక్షకుల్లో హైప్ ఉండదు. అలా 2022 ముగించింది. అంతకు ముందు ఆమె కెరీర్ పూర్తిగా డల్ అయ్యింది. 2020, 2021లో అనుపమ నుండి ఒక్క తెలుగు చిత్రం కూడా రాలేదు. రాక్షసుడు చిత్రం తర్వాత ఆమెకు గ్యాప్ వచ్చింది. దీంతో టాలీవుడ్ లో ఆమె జర్నీ ముగిసినట్లే అనుకున్నారు.

ప్రస్తుతం ఆమె తమిళంలో ఒక మూవీ, మలయాళంలో మరొక మూవీ చేస్తున్నారు. తెలుగులో కొత్త ప్రాజెక్ట్ కి సైన్ చేయలేదు. ఈ క్రమంలో మేకర్స్ ని తన అందాలతో ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడూ లేనిదీ అనుపమ స్కిన్ షోకి తెరలేపుతున్నారు. ఆమె తాజా ఫోటో షూట్ లో కొంచెం ఎక్స్ఫోజింగ్ ఎక్కువైంది. స్లీవ్ లెస్ ఫ్రాక్ ధరించి సైడ్ యాంగిల్ నుండి యద అందాలు చూపిస్తూ కవ్వించింది. సూపర్ హాట్ గ్లామరస్ గా ఉన్న అనుపమ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. ఇక ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.