Sri Satya – Faima: ఎన్నో ఊహించని మలుపులతో భావోద్వేగాల మధ్య బిగ్ బాస్ సీజన్ 6 చివరి దశకి చేరుకుంది..గడిచిన రెండు వారాల నుండి చప్పుడు లేకుండా ప్రశాంతంగా జరిగిపోయిన నామినేషన్స్ ఈ వారం మాత్రం హీట్ వాతావరణం లో జరిగింది..గత వారం రాజ్ బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వగా, ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటకి వెళ్ళడానికి నామినేట్ అయిన ఇంటి సభ్యులు శ్రీ సత్య , ఫైమా , కీర్తి,ఆది రెడ్డి , రేవంత్ మరియు రోహిత్..వీరిలో అతి తక్కువ ఓట్లతో ఎవరు వెళ్ళిపోబోతున్నారు అనేది చూడాలి.

ప్రస్తుతం ఉన్న ఓటింగ్ ప్రకారం రేవంత్ అందరికంటే ఎక్కువ ఓట్లతో నెంబర్ 1 స్థానం లో కొనసాగుతున్నాడు..ఇది ప్రతి వారం చాలా కామన్ పాయింట్ అయిపోయింది..ఇక ఆయన తర్వాత రోహిత్ అత్యధిక ఓట్లతో రెండవ స్థానం లో కొనసాగుతున్నాడు..రోహిత్ గ్రాఫ్ ఈ రేంజ్ లో పెరుగుతుందని బహుశా రోహిత్ ని అభిమానించే వారు కూడా ఊహించి ఉండరు.
ఇక వీళ్లిద్దరి తర్వాత కీర్తి మూడవ స్థానం లో కొనసాగుతుంది..చేతి వేళ్ళు విరిగిపోయిన కూడా ఎక్కడా తగ్గకుండా కీర్తి ఆడుతున్న ఫిజికల్ టాస్కులను చూసి ప్రేక్షకుల్లో రోజు రోజుకి సానుభూతి పెరిగిపోతుంది..కాబట్టి ఈమె కచ్చితంగా టాప్ 5 లో ఉండే అవకాశాలు ఉన్నాయి..ఇక ఆ తర్వాతి స్థానం లో ఆది రెడ్డి ఉన్నాడు.

మొదటి రోజు నుండి నేటి వరుకు ఆది రెడ్డి తనకి కరెక్ట్ అనిపించినా విధంగానే ఆడుకుంటూ వస్తున్నాడు..ఇతనికి కూడా టాప్ 5 లోకి అడుగుపెట్టే ఛాన్స్ ఉంది..నిన్న జరిగిన నామినేషన్స్ లో కూడా సరైన పాయింట్స్ తో రేవంత్ ని దెబ్బకొట్టడం లో సక్సెస్ అయ్యాడు..ఇక చివరి రెండు స్థానాల్లో కొనసాగుతూ డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ ప్రస్తుతానికి అయితే శ్రీ సత్య మరియు ఫైమా..ఫైమా కి శ్రీ సత్య కంటే తక్కువ ఓటింగ్ ఉంది..రాబొయ్యే రోజుల్లో ఆమె తన ఆట తీరుని మెరుగుపర్చుకొని గ్రాఫ్ పెంచుకోకపోతే ఎలిమినేట్ అవ్వక తప్పేలా లేదు.