
Modi’s Hunter Look : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కర్ణాటకలోని మధుమలై – బందీపూర్ లోని అటవీ ప్రాంతంలో గడిపారు. ఇక్కడ గల టైగర్ ఫారెస్ట్ లో జీపులో తిరిగి మొత్తం పరిశీలించారు. అడవిలో తిరిగాడే పులుల మధ్య.. హంటర్ లుక్ లో కనిపించి ప్రధాని మోదీ అదరగొట్టారు. ఈ ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. అనంతరం ఆయన తెప్పకాడులోని ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. ఏనుగులతో కాసేపు గడిపారు.
50 ఏళ్ల కిందట ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభం
దేశంలో పులుల సంఖ్యను పెంచే ఉద్దేశంతో 50 ఏళ్ల కిందట ప్రాజెక్ట్ టైగర్ ను ప్రారంభించారు. 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వును ప్రధాన మోడీ సందర్శించారు. ఈ ప్రాజెక్టు వల్ల భారత దేశంలో పులుల సంఖ్య భారీగా పెరిగింది. 2,967 నుంచి 3,167 కి పెరిగింది దేశంలో పులుల సంఖ్య. ఈ సందర్భంగా అఖిల భారత పులుల అంచనా సారాంశం నివేదికను మైసూరులోని ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేశారు. మోడీ ఇంటర్నేషనల్ బిగ్ కాట్స్ అలయన్స్ (ఐబిసిఏ) ను కూడా ప్రధాన నరేంద్ర మోడీ ప్రారంభించారు. పులి సంరక్షణ కోసం అమృత్ కల్ కా విజన్, ప్రాజెక్టు టైగర్ 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఒక స్మారక నాణాన్ని నరేంద్ర మోడీ విడుదల చేశారు.
యావత్ ప్రపంచానికే గర్వకారణం
ఈ సందర్భంగా నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. భారతదేశం పులులను సంరక్షించడమే కాకుండా అవి అభివృద్ధి చెందడానికి పర్యావరణ వ్యవస్థను సృష్టించిందని, ప్రాజెక్టు టైగర్ విజయం భారతదేశ నికే కాకుండా యావత్ ప్రపంచానికి గర్వకారణమని పేర్కొన్నారు. దశాబ్దాల క్రితమే భారత దేశంలో చిరుతలు అంతరించిపోయాయని మోడీ పేర్కొన్నారు. ప్రపంచ భూభాగంలో కేవలం రెండు పాయింట్ నాలుగు శాతం మాత్రమే ఉన్న భారతదేశంలో జీవ వైవిద్యానికి ఎనిమిది శాతం దోహదం చేస్తోందని ఈ సందర్భంగా ప్రధాన మోడీ పేర్కొన్నారు. ప్రకృతిని పరిరక్షించడం భారతీయ సంస్కృతిలో భాగమని ఈ సందర్భంగా ప్రధాన మోడీ వెల్లడించారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిందని, అదే సమయంలో ప్రపంచంలోని పులుల జనాభాలో 75% భారతదేశంలో ఉండడం గర్వకారణం అన్నారు. ప్రపంచంలోనే ఆసియా సింహాలు ఉన్న ఏకైక దేశం భారత్ అని ఈ సందర్భంగా ప్రధాన మోడీ స్పష్టం చేశారు. అలాగే దాదాపు 30 వేల ఏనుగులతో ప్రపంచంలోనే అతిపెద్ద ఆసియా ఏనుగుల శ్రేణి భారతదేనని ఆయన స్పష్టం చేశారు.

సరికొత్త లుక్ లో కనిపించిన మోదీ
మోడీ వస్త్రధారణ ఎప్పుడు విభిన్నంగా ఉంటుంది. ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతానికి సంబంధించిన సాంప్రదాయ వస్త్రాలను ధరించడం మోడీ ప్రత్యేకత. విదేశాల్లో ప్రయాణించినప్పుడు అక్కడి తన షెడ్యూల్, సమావేశాలకు అనుగుణంగా మోదీ వస్త్రధారణ ఉంటుంది. ఇక తాజాగా కర్ణాటకలోని టైగర్ ఫారెస్ట్ లో పర్యటించిన ప్రధాన మోడీ భిన్నమైన లుక్ లో కనిపించారు. సఫారీ దుస్తులు, కళ్ళకు అద్దాలు, నెత్తిన టోపీ, చేతిలో విలువైన కెమెరాతో.. హంటర్ లుక్ లో ప్రధాని మోడీ కనిపించారు. ఈ లుక్ చూసిన ఎంతో మంది అడవిలోని పులుల మధ్య.. భారతదేశ పొలిటికల్ టైగర్ తిరుగుతోందంటూ పలువురు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
-పులుల సంఖ్య పెరగడానికి కారణమేంటి?
పులి, సింహం, చిరుతపులి, మంచు చిరుత, ప్యూమా, జాగ్వార్ మరియు చిరుతలతో సహా ప్రపంచంలోని 7 పెద్ద పెద్ద పిల్లుల సంరక్షణపై అంతర్జాతీయ పెద్ద పులల కూటమి దృష్టి సారించింది. దానికి అనుగుణంగా భారత దేశం కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యంగా మోడీ వచ్చాక నమీబియా సహా విదేశాల నుంచి దేశంలో అంతరించిపోతున్న పులలను తీసుకొచ్చాడు. అటవీ భూమిని రక్షించాడు. పులలకు ఆవాసంగా మార్చాడు. వాటి సంరక్షణ చర్యలు చేపట్టడంతో వాటి సంతతి పెరిగి ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక పులుల సంఖ్య ఒక చోట పెరిగిన ప్రాంతంగా కర్ణాటక అడవులు నిలిచాయి.
మధ్య భారతదేశానికి చెందిన భరియా కమ్యూనిటీ మరియు మహారాష్ట్రకు చెందిన వోర్లీ కమ్యూనిటీ ఇతరులలో పులిని పూజిస్తారు, అయితే భారతదేశంలోని అనేక సంఘాలు పులిని స్నేహితుడిగా , సోదరుడిగా భావిస్తాయి. మా దుర్గ , అయ్యప్ప పులిపై స్వారీ చేస్తారని.. అందుకే పులులను రక్షించామని ప్రధాని మోదీ అంటున్నారు. ఈ జాతులను అంతరించిపోకుండా కాపాడడంలో మోడీ సక్సెస్ సాధించారు. సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థను సృష్టించడంలో ఇది సాహయపడనుంది.