
అల్లు అర్జున్ ‘పుష్ప’ టీజర్ రిలీజ్ అయ్యి ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించింది. ఊర మాస్ గెటప్ లో బన్నీని అలా బీభత్సంగా చూసిన ఫ్యాన్స్, మూవీ అభిమానులు ఫిదా అయిపోయారు. దెబ్బకు ఈ ప్యాన్ ఇండియా మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
ఈ టీజర్ విడుదలయ్యాక సుకుమార్ పుష్పలో బన్నీని వేరే లెవల్ లో చూపించబోతున్నట్టు అర్థమైంది. అయితే అడవుల్లో గంధపు చెక్కల స్మగ్లర్ గా ఫుల్ మాస్ రగ్డ్ డ్ గెటప్ లో కనిపించిన బన్నీని అలా చూస్తామని ఎవ్వరూ ఊహించలేదు.
అందుకే తాజాగా పూర్తి మాస్ స్టైలిష్ లుక్ లో ఉన్న ‘పుష్ప’ సినిమాలోని మరో లుక్ ను బయటపెట్టారు మేకర్. తాజాగా పుష్ప నుంచి న్యూ పోస్టర్ ఒకటి బయటకు వచ్చింది.
అల్లు అర్జున్ ఓ బైక్ పై ఠీవీగా కూర్చొని నీట్ గా డ్రెస్ వేసుకొని చెయ్యి పైకెత్తి కళ్లద్దాలు పెట్టుకొని టక్ చేసుకొని కోపంగా చూస్తున్న ఫొటోలో స్టైలిష్ గా బన్నీ కనిపిస్తున్నాడు. ఆ గడ్డం మాత్రమే అలా ఉంది. మిగతా అంతా బాగున్నాడు. బుల్లెట్ బైక్ పై అదిరిపోయేలా మాస్ గెటప్ లో దర్శనమిచ్చాడు.
సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ముత్యంశెట్టి మీడియా సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో చిత్రాన్ని తీస్తున్నారు.