Rajamouli- RRR: #RRR మూవీ టీం ఇక విదేశాల్లోనే కొన్ని రోజులు స్థిరపడిపోతే మంచిది..ఎందుకంటే వీళ్ళని అక్కడి నుండి కదిలించేలా లేరు హాలీవుడ్ ఆడియన్స్..వరుసగా అంతర్జాతీయ ప్రతిష్టాత్మక అవార్డ్స్ ని సొంతం చేసుకుంటూ తరుచూ వార్తల్లో వినపడుతూనే ఉంది #RRR..ఆస్కార్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్’ ని ‘నాటు నాటు’ కి ఈమధ్యనే ఇచ్చారు..’బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ క్యాటగిరి లో కీరవాణి కి ఈ అవార్డుని ఇచ్చారు.

ఈ అవార్డు వచ్చిన కొద్దీ రోజులకే ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి కి ‘లాస్ ఏంజిల్స్ ఫిల్మ్ క్రిటిక్స్’ అవార్డు ని గెలుపొందాడు..ఇప్పుడు ఈ చిత్రానికి మరో అంతర్జాతీయ అవార్డు దక్కింది..ఈ సినిమాలోని పోరాట సన్నివేశాలు అభిమానులను మరియు ప్రేక్షకులను ఎంతలా అబ్బురపరిచాయి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..రామ్ చరణ్ ఇంట్రడక్షన్ ఫైట్, ఇంటర్వెల్ ఫైట్ మరియు క్లైమాక్స్ ఫైట్ ఇప్పటి వరకు వరల్డ్ సినిమాలో ఏ దర్శకుడు కూడా తియ్యని రేంజ్ తీసాడు రాజమౌళి.
ఇప్పుడు ఆ క్యాటగిరీ లోనే #RRR చిత్రానికి ‘సీటల్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్స్’ ని సొంతం చేసుకుంది..ఈ చిత్రానికి పోరాట దృశ్యాలు రూపకల్పన చేసింది ‘సొలోమాన్’..ఆయనకే ఈ అవార్డు ఇవ్వనున్నారని తెలుస్తుంది..ఇలా హాలీవుడ్ లో ఎన్ని అవార్డ్స్ అయితే ఉంటాయో అన్ని అవార్డ్స్ #RRR చిత్రానికి దక్కడం నిజంగా గర్వకారణం..ఏ దర్శకుడికైనా మ్యాజిక్స్ ఒకటి రెండు సార్లు వర్కౌట్ అవుతుంది..కానీ రాజమౌళి తన ప్రతీ సినిమాతో మాయ చేసేస్తాడు.

ఇప్పుడు త్వరలోనే ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక సినిమా చెయ్యబోతున్న సంగతి తెల్సిందే..#RRR చిత్రం తో పాన్ వరల్డ్ మార్కెట్ ని ఓపెన్ చేసిన రాజమౌళి, మహేష్ బాబు తో తియ్యబోతున్న సినిమాని పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడు..ఈ సినిమా అనుకున్న విధంగా సూపర్ హిట్ అయితే మాత్రం వసూళ్ల పరంగా హాలీవుడ్ చిత్రాలతో పోటీ అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదని అంటున్నారు విశ్లేషకులు.