Allu Arjun Arrested: ‘పుష్ప 2’ ప్రీమియర్ షో చూసేందుకు హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ కి అల్లు అర్జున్ వచ్చిన సమయంలో తొక్కిసిలాట జరగడం, రేవంతి అనే మహిళ మృతి చెందడం రాష్ట్రం లో ఎంతటి సంచలనం రేపిందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ అయ్యింది. అల్లు అర్జున్ బాధ్యతారాహిత్యం గా ప్రవర్తించాడని పోలీసులు మండిపడ్డారు. తమకి ముందస్తుగా తాను వస్తున్నట్టు ఎలాంటి సమాచారం అందించలేదని, దాని వల్ల మేము పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయలేకపోయామని, అప్పటికీ మా పరిదమేర చాలా వరకు సెక్యూరిటీ పెంచామని చెప్పుకొచ్చారు పోలీసులు. ఈ ఘటన పై సోషల్ మీడియా లో అభిమానుల నుండి తీవ్రమైన ఆగ్రహ జ్వాలలు అలుముకున్నాయి. ఇది సీఎం రేవంత్ రెడ్డి కావాలని కక్ష్య పూరిత రాజకీయాలు చేస్తున్నారని, మా అల్లు అర్జున్ కి ఏదైనా జరిగితే చూస్తూ ఊరుకోమని అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియా ద్వారా పోస్టులు వేశారు.
మరోపక్క ఈ ఘటన పై ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అల్లు అర్జున్ చిన్న మేనమామ పవన్ కళ్యాణ్ ఆరా తీసాడు. జరిగిన విషయాలన్నీ తెలుసుకున్న ఆయన, అల్లు అర్జున్ ని విడిపించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని సంప్రదించినట్టు తెలుస్తుంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ, అంతర్గతంగా మాత్రం దీనిపై పవన్ కళ్యాణ్ అధికారులతో చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గడిచిన ఆరు నెలల నుండి అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య సోషల్ మీడియా లో ఎలాంటి గొడవలు జరుగుతున్నాయో మన అందరికీ తెలిసిందే. కానీ అవసరమైనప్పుడు ఒకరి కోసం ఒకరు నిలబడతారు అనేందుకు ఇది ఒక ఉదాహరణ అని, వాళ్ళ మధ్య ఎన్ని మనస్పర్థలు ఉన్నప్పటికీ సమస్య వచ్చినప్పుడు అంత ఏకం అవుతారనే విషయం ఇప్పటికైనా అభిమానులు అర్థం చేసుకోవాలంటూ సోషల్ మీడియా లో ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.
పవన్ కళ్యాణ్ నేడు విజన్ 2047 డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఇప్పటికీ ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. ఈ మీటింగ్ అయిపోయాక ఆయన ప్రత్యేక విమానం లో హైదరాబాద్ కి చేరుకుంటాడని, అనంతరం రోడ్డు మార్గం ద్వారా అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్ కి చేరుకుంటాడని తెలుస్తుంది. అంతే కాకుండా ఆయన మీడియా తో మాట్లాడే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే చనిపోయిఉన్న రేవతి కుటుంబాన్ని ఆడుకుంటూ అల్లు అర్జున్ పాతిక లక్షల రూపాయిల ఆర్ధిక సాయం అందించిన సంగతి తెలిసిందే. మరోపక్క సంధ్య థియేటర్ యాజమాన్యం ని కూడా పోలీసులు రెండు రోజుల క్రితమే అరెస్ట్ చేసారు. ఈ ఘటన తర్వాత తెలంగాణ లో ఇక బెన్ఫిట్ షోస్ ఉం