
Anchor Sreemukhi- Monal Gajjar: ఎంటర్టైన్మెంట్ షోలలో శ్రీముఖి చర్యలు హద్దులు దాటేస్తున్నాయి. సిక్స్త్ సెన్స్ లేటెస్ట్ ఎపిసోడ్లో శ్రీముఖి చేసిన పనికి అందరూ అవాక్కయ్యారు. ఛీ ఇదేం పాడు పని అని తిట్టిపోస్తున్నారు. ఓంకార్ యాంకర్ గా సిక్స్త్ సెన్స్ లేటెస్ట్ సీజన్ ప్రారంభమైంది. సిక్స్త్ సెన్స్ తాజా ఎపిసోడ్ లో శ్రీముఖి, మోనాల్ పాల్గొన్నారు. ఎంట్రీ కోసం ఐటెం సాంగ్ ప్లే చేశారు. క్రాక్ మూవీలోని బోల్డ్ సాంగ్ కి టెంప్టింగ్ స్టెప్స్ లో కేక పుట్టించారు. శ్రీముఖి తన డ్రెస్ ని ఉద్దేశిస్తూ పచ్చి కామెంట్ చేశారు. టాప్ సరి చేసుకుంటూ… ‘నన్నేమో ఫుల్ కవర్ వేసుకురమ్మంటారు. మీరేమో అన్నీ చూపించేస్తారు’ అని అన్నారు.
యాంకర్ గా ఉన్న ఓంకార్ ధరించిన కోటు ఆయన చెస్ట్ కనిపించేలా ఉంది. దాంతో మీరు మాత్రం చూపించొచ్చు నేను చూపించకూడదా అన్న అర్థంలో శ్రీముఖి అన్నారు. అనంతరం మోనాల్ పట్ల కొంచెం అసభ్యంగా ప్రవర్తించారు. మోనాల్ దగ్గరికి పోయి ఆమె చుట్టూ తిరుగుతూ… పుష్ప మూవీలోని ఫేమస్ డైలాగ్ ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైర్’ చెప్పింది. అంతటితో ఆగకుండా ఆమె బటక్స్ మీద కొట్టింది. శ్రీముఖి చేసిన పనికి మోనాల్ షాక్ అయ్యింది.
ఎదురుగా మేల్ యాంకర్ ఉన్నాడని కూడా లేకుండా మోనాల్ ప్రైవేట్ పార్ట్స్ మీద శ్రీముఖి టచ్ చేయడం సంచలనమైంది. శ్రీముఖి అంతకంతకూ తెగిస్తుందంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా శ్రీముఖి తీరు విమర్శల పాలవుతుంది. విచ్చలవిడిగా అందాల ప్రదర్శన చేస్తుంది. చాలీ చాలని బట్టలో శ్రీముఖి బోల్డ్ ఫోటో షూట్స్ ఇంస్టాగ్రామ్ లో చర్చకు దారి తీస్తున్నాయి. నెటిజెన్స్ ఆమె ఫోటోలపై బూతు కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ఇదంతా కెరీర్ కోసమే అని శ్రీముఖి సమర్థించుకుంటోంది. గ్లామర్ ఫీల్డ్ లో ఎదగాలంటే అందాల ప్రదర్శన తప్పదని ఆమె గట్టిగా నమ్ముతున్నారు. బుల్లితెరకు గ్లామర్ యాంగిల్ అనసూయ, రష్మీ పరిచయం చేశారు. వారిని స్ఫూర్తిగా తీసుకున్న శ్రీముఖి స్టార్ యాంకర్ అయ్యారు. ఈ మధ్య ఏ ఛానల్ లో చూసినా శ్రీముఖిదే సందడి. యాంకరింగ్ లో సత్తా చాటుతూనే నటిగా ఎదిగే ప్రయత్నాలు చేస్తుంది. చిరంజీవి, బాలకృష్ణ అప్ కమింగ్ చిత్రాల్లో శ్రీముఖి కీలక రోల్స్ చేస్తున్నట్లు సమాచారం. హీరోయిన్ గా కొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.