
Anchor Rashmi: రష్మీ గౌతమ్ అనుకోని వివాదంలో చిక్కుంది. ఆమెపై నెటిజెన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కలు ఒక బాలుడిని చంపిన నేపథ్యంలో ఆమె జనాల టార్గెట్ అయ్యారు. తాజాగా హైదరాబాద్ నగరంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ మూడేళ్ళ బాలుడిని వీధి కుక్కలు అత్యంత క్రూరంగా చంపేశాయి. బాలుడు వీధిలో ఒంటరిగా నడిచి వెళుతుండగా దాడి చేశాయి. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పిల్లాడు కుక్కల దాడిలో ప్రాణాలు వదిలాడు. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. తెలంగాణా ప్రభుత్వంతో పాటు జిహెచ్ఎంసి పాలకవర్గం మీద పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నాయి.
సంబంధిత అధికారులు స్పందించారు. తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో యానిమల్ లవర్ రష్మీ గౌతమ్ నెటిజెన్స్ టార్గెట్ అయ్యారు. వీధి కుక్కలపై కోపాన్ని ఆమె వైపుకు మళ్లించారు. వీధి కుక్కలను కాపాడాలి అంటారుగా.. ఇప్పుడు చూడండి అవి ఎంత ఘోరానికి పాల్పడ్డాయో. దీనికి మీ సమాధానం ఏమిటని రష్మీని నిలదీస్తున్నారు. ఈ క్రమంలో రష్మీ గౌతమ్ స్పందించారు. ఆమె తనను సమర్ధించుకున్నారు.
వీధి కుక్కలకు వ్యాక్సిన్ వేయడం, వాటి సంతానం తగ్గించడం వంటి చర్యలు తీసుకోవాలి. కుక్కలు కూడా మనుషుల వలె సామాజిక జీవులు. పిల్లాడు అన్యాయంగా ప్రాణాలు కోల్పోయాడు. అయినప్పటికీ ఇక్కడ జీవించే హక్కు కుక్కల కూడా ఉందంటూ సంఘటను సమర్దిస్తున్నట్లు మాట్లాడారు. రష్మీ ట్వీట్ మరింత ఆగ్రహానికి కారణమైంది. నీకు కుక్కల మీద ఉంటే వాటిని తీసుకెళ్లి ఒరిస్సాలో కొన్న 100 ఎకరాల ఫార్మ్ హౌస్లో పెంచుకో, అని ఒకరు కామెంట్ చేశారు.

ఒకప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు కుక్కలను బంధించి జనాల మధ్య లేకుండా చేసేవాళ్ళు. మీలాంటి వాళ్ళు కేసులు వేసి వాళ్ళను కట్టడి చేశారు. అందుకే ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటున్నాయని మరొక నెటిజన్ కామెంట్ పోస్ట్ చేశారు. పిల్లాడిని దారుణంగా చంపిన వీధి కుక్కల మీద, వాటిని ఏమీ చేయకూడదని సమర్థిస్తున్న రష్మీ గౌతమ్ మీద జనాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలో రష్మీని ఓ ఆటాడుకుంటున్నారు. రష్మీ చాలా కాలంగా మూగ జీవాల సంరక్షణ కోసం పాటుపడుతున్నారు. దానిలో భాగంగా ఆమె వీగన్ గా మారారు. మాంసం, పాలు, పాల పదార్థాలు ఆమె తినరు.
Unfortunately yes the little boy did die for no fault of his and a long term solution of birth control,vaccination and shelter shud be implemented
Animals are territorial just like us they need there own space https://t.co/GTZ1UhRlCN— rashmi gautam (@rashmigautam27) February 21, 2023