
Rashmi Gautam: యాంకర్ రష్మీ గౌతమ్ కామెడీ పేరుతో బూతులు మాట్లాడేస్తున్నారు. జబర్దస్త్ వేదికగా ఆమె పంచ్లు కొంచెం శృతి మించుతున్న భావన కలుగుతుంది. పిల్లలు పుట్టాలంటే మంచాలకు దగ్గరగా ఉండాలంటూ డబుల్ మీనింగ్ కామెడీకి తెరలేపింది. నిజానికి జబర్దస్త్ ఒకప్పుడు అడల్ట్ కామెడీ షోగా ఉండేది. షో స్టార్ట్ అయిన కొత్తలో టీమ్ లీడర్స్ గా ఉన్న కమెడియన్స్, మేజర్ గా అడల్ట్ కామెడీ మీద దృష్టి పెట్టారు. టెలివిజన్ షోలలో ఈ తరహా కామెడీ దారుణమన్న విమర్శలు వెల్లువెత్తాయి. అదే సమయంలో కొన్ని కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. దాంతో మరీ ఓవర్ గా ఉండే డబుల్ మీనింగ్ జోక్స్ వద్దని నిర్ణయం తీసుకున్నారు.
అప్పటి నుండి అడల్ట్ జోక్స్ ఉన్నప్పటికీ పరిమితుల్లో ఉండేలా, జనాలు అంగీకరించేలా చూసుకుంటున్నారు. అయితే ఈ మధ్య మరలా డోసు పెంచారన్న సందేహాలు కలుగుతున్నాయి. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. పలు కారణాలతో సీనియర్స్ వెళ్లిపోయారు. టీమ్ లీడర్, కంటెస్టెంట్స్ అందరూ కొత్తవారు. గతంతో పోల్చితే షో క్వాలిటీ తగ్గింది. నవ్వులు పండించడంలో కమెడియన్స్ ఫెయిల్ అవుతున్నారు.
ఏం చేసైనా టీఆర్పీ తెప్పించాలి. ఈ క్రమంలో బూతు జోకులను నమ్ముకుంటున్నారేమో అన్న సందేహం కలుగుతుంది. తాజాగా యాంకర్ రష్మీ దారుణమైన జోక్ వేసింది. ఆమె నోటి నుండి ఒక అడల్ట్ జోక్ వచ్చింది. స్కిట్ లో భాగంగా ఓ కమెడియన్ ‘పిల్లలు పుట్టాలంటే ఇలా కంచానికి దగ్గరగా ఉంటే కుదరదే’ అనగానే… యాంకర్ రష్మీ అందుకుంటూ ‘మంచానికి దగ్గరగా ఉండాలని’ అరిచింది. ఆమె జోక్ కి జడ్జెస్ గా ఉన్న కృష్ణభగవాన్, కుష్బూ నవ్వారు.

ఇలాంటి జోక్స్ పై జబర్దస్త్ ఆడియన్స్ కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంటిల్లిపాది చూసే టీవీ షోలలో ఈ తరహా అడల్ట్ జోక్స్ వద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు. కాగా నాగబాబు, రోజా, అనసూయ, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర వంటి స్టార్స్ ఒక్కొక్కరిగా జబర్దస్త్ వీడారు. వారి నిష్క్రమణతో షో మెల్లగా వెలుగు కోల్పోయింది. జబర్దస్త్ అంటే ఒకప్పుడు జనాల్లో ఉన్న ఆసక్తి ఇప్పుడు లేదు. కొంతకాలంగా జబర్దస్త్ టీఆర్పీ పడిపోతూ వస్తుంది. ఈ క్రమంలో మల్లెమాల కొత్త షోలపై దృష్టి పెడుతున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ సక్సెస్ ఫుల్ గా సాగిపోతుంది.