Anchor Pradeep Marriage: ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలంటారు. వివాహం సరైన సమయంలో చేసుకోవాలి. ఒకప్పుడు పెద్దవాళ్ళు పట్టుబట్టి పిల్లలకు రైట్ ఏజ్ లో పెళ్లి చేసేవారు. జీవన శైలి, ఆలోచన విధానం మారుతూ వస్తుండగా పెళ్లిని జీవితంలో సీరియస్ మేటర్ గా జనాలు తీసుకోవడం లేదు. ఎప్పుడో తీరిక దొరికినప్పుడు చేసుకుందాంలే. అసలు చేసుకోపోతే మాత్రం వచ్చే నష్టం ఏముందనే ధోరణిలోకి వెళుతున్నారు. కొందరు అబ్బాయిలకేమో అమ్మాయిలు దొరక్క పెళ్లిళ్లు జరగడం లేదు.

చిటికేస్తే అందగత్తెలు క్యూ కట్టే సెలబ్రిటీలు కూడా పెళ్లి పెటాకులు లేకుండా ఉండిపోతున్నారు. కాగా బుల్లితెర మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ గా ప్రదీప్ మాచిరాజు ఉన్నాడు. ఈ స్టార్ యాంకర్ కి పెళ్లీడు దాటిపోయి దశాబ్దం అవుతుంది. కెరీర్లో సక్సెస్ చూసినా కూడా పెళ్లి ఆలోచన చేయడం లేదు. అదుగో పెళ్లి… ఇదిగో అమ్మాయి అని పుకార్లు మాత్రమే కానీ అధికారిక ప్రకటన రావడం లేదు.
ఇటీవల ఫ్యాషన్ డిజైన్ నవ్య అనే అమ్మాయిని ప్రదీప్ పెళ్లి చేసుకుంటున్నారనే ప్రచారం జరిగింది. ఇద్దరి కులాలు, మతాలు వేరైనప్పటికీ పెద్దలు వీరి ప్రేమకు అంగీకారం తెలిపారని, త్వరలో పెళ్లి అంటూ వార్తలు వచ్చాయి. పర్టిక్యులర్ గా అమ్మాయి పేరు కూడా బయటకు రావడంతో ఈ వార్తల్లో నిజం ఉందని జనాలు భావించారు. నవ్యతో నాకు పరిచయం లేదు. కలిసి మాట్లాడింది కూడా లేదు. ప్రొఫెషన్ లో భాగంగా నా టీమ్ ఆమెతో కలిశారు. నవ్యతో నా వివాహం అన్న వార్తల్లో నిజం లేదని ప్రదీప్ తేల్చి పారేశారు.

తాజాగా మరోసారి ఆయన పెళ్లిపై నోరు విప్పారు. ఆయన యాంకర్ గా ఉన్న లేడీస్ అండ్ జెంటిల్ మెన్ షోకి సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఆర్పీ పట్నాయక్, రఘు కుంచె వచ్చారు. మాటల్లో మాటగా ”ప్రదీప్ పెళ్లి చేసుకునే అమ్మాయి ఎవరో తెలుసా? తెలిస్తే షాక్ అవుతారు?” అనే వార్తలు చూస్తున్నాను. అసలు మేటర్ ఏంటని రఘు కుంచె… ప్రదీప్ ని అడిగారు. ఆ అమ్మాయి ఎవరో తెలిస్తే నేను కూడా షాక్ అవుతా సార్, అని ప్రదీప్ టైమింగ్ జోక్ వేశారు. పరోక్షంగా నా పెళ్లి అంటూ వచ్చే వార్తలన్నీ పుకార్లే, అలాంటిది ఏమైనా ఉంటే నేనే చెప్తా అని స్పష్టత ఇచ్చారు.