Anasuya Bharadwaj: అనసూయను జబర్దస్త్ ఆడియన్స్ బాగా మిస్ అవుతున్నారు. గురువారం వస్తుందంటే ఆమె అభిమానుల్లో గుండె దడ మొదలయ్యేది. ఇవాళ ఏ డ్రెస్ లో గ్లామర్ ఒలకబోస్తుందో అని ఎదురు చూస్తూ ఉండేవారు. బుల్లితెరకు గ్లామర్ యాంగిల్ పరిచయం ఘనత అనసూయదే. యాంకర్స్ అంటే నిండైన బట్టలు వేసుకోవాలనే ట్రెడిషన్ బ్రేక్ చేసింది. అనసూయ స్ఫూర్తితో యాంకర్స్ గా మారిన శ్రీముఖి, వర్షిణి, రష్మీ స్టార్స్ అయ్యారు. బుల్లితెరను దున్నేస్తున్నారు. కాగా పదేళ్ల జబర్దస్త్ ప్రయాణానికి అనసూయ స్వస్తి పలికింది.

జబర్దస్త్ తో పాటు ఆమె టెలివిజన్ షోస్ కి పూర్తిగా దూరం అయ్యారు. ఇది మరింత బాధించే అంశం. అయితే కొంతలో కొంత సోషల్ మీడియా ద్వారా ఆమె తన ఆరాధకులను ఎంటర్టైన్ చేస్తుంది. ఇంస్టాగ్రామ్ లో ఫోటో షూట్స్ షేర్ చేస్తూ పండగ చేసుకోండి అంటుంది. తాజాగా కోటు, ప్యాంటు ధరించి లేడీ బాస్ లుక్ లో కేక పుట్టించింది. అనసూయ కార్పొరేట్ గెటప్ అదిరిపోయింది. క్లాస్ అయినా మాస్ అయినా అనసూయలో గ్లామర్ యాంగిల్ ఉండాల్సిందే. అందుకే కోటు బటన్స్ తీసి… చాటుగా నాభిని చూపించి మనసులు ఘాటెక్కించింది.
అనసూయ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. ఇక కామెంట్స్ కామన్ కాబట్టి, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాడు తమ ఫీలింగ్స్ తెలియజేస్తున్నారు. అనసూయను ఆంటీ అని ట్రోల్ చేసే వారి సంఖ్య ఇంకా తగ్గలేదు. ఇటీవల అనసూయ ట్రోలర్స్ ని అరెస్ట్ చేయించారు. అనసూయ కంప్లైంట్ మేరకు యాంకర్స్, నటులను ట్రోల్ చేస్తూ, అసభ్యకర పోస్ట్స్ పెడుతున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి, పోలీసులు రిమాండ్ కి పంపారు. అయినా అనసూయపై సోషల్ మీడియా ట్రోల్స్ ఆగడం లేదు.

ఎవరేమనుకున్నా అనసూయకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ఆమె కెరీర్ పీక్స్ లో ఉంది. చేతినిండా అవకాశాలతో దూసుకుపోతుంది. ఒక్కో కాల్షీట్ కి అనసూయ రూ. 3 లక్షల వరకు తీసుకుంటున్నారట. సినిమాలతో పాటు సిరీస్లలో నటిస్తున్నారు. అలాగే ప్రమోషన్స్, షాప్ ఓపెనింగ్స్ అంటూ మరికొంత ఆదాయం ఆర్జిస్తోంది. అనసూయ నెలకు కోటి రూపాయలకు తగ్గకుండా సంపాదిస్తున్నారట. కాగా అనసూయ పుష్ప 2 లో నటిస్తున్న విషయం తెలిసిందే. పుష్ప పార్ట్ 1లో సమంత ఐటెం నంబర్ చేయగా… ఈసారి బోల్డ్ ఐటెం సాంగ్ అనసూయపై సుకుమార్ ప్లాన్ చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. అయితే ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.