
Anasuya Bharadwaj: యాంకర్ అనసూయ అనడం కంటే యాక్టర్ అనసూయ అనడం బెటరేమో. ఎందుకంటే అనసూయ ఇప్పుడు యాంకర్ కాదు. ఆ వృత్తికి శాశ్వతంగా గుడ్ బై చెప్పేసింది. ఇకపై ఆమెను బుల్లితెర వ్యాఖ్యాతగా చూడటం కష్టమే. కారణం మరో ఐదారేళ్ళ ఆమె సిల్వర్ స్క్రీన్ మీద బిజీగా ఉండటం ఖాయం. తర్వాత కెరీర్ నెమ్మదించి ఆఫర్స్ తగ్గినా యాంకర్ గా చేసే అవకాశం లేదు. ఎందుకంటే అప్పుడు అనసూయ యాంకరింగ్ చేసే వయసు దాటిపోతుంది. 40 ప్లస్ లో యాంకర్ గా చేయడం తప్పు కాదు. సుమ ఇప్పటికీ స్టార్ యాంకర్ గా ఉన్నారు.
అయితే అనసూయ గ్లామరస్ యాంకర్. ఆమె ఇమేజ్ వేరు. ఏజ్ బార్ అయ్యాక అనసూయను హాట్ యాంకర్ గా జనాలు అంగీకరించరు. ఈ సమీకరణాల రీత్యా అనసూయను మళ్ళీ బుల్లితెర మీద చూడాలనుకే వాళ్ళ ఆశలు తీరవని చెప్పొచ్చు. జబర్దస్త్ ఆమెను ఫేమస్ చేసింది. హీరోయిన్ స్థాయికి తీసుకు వచ్చింది. గత ఏడాది ఆమె జబర్దస్త్ నుండి తప్పుకున్నారు.

జబర్దస్త్ మానేశాక అనసూయ ఆరోపణలు చేయడం విశేషం. జబర్దస్త్ కమెడియన్స్ తనపై బాడీ షేమింగ్ కి పాల్పడ్డారని సంచలన కామెంట్స్ చేశారు. తన శరీరం మీద వారు వేసే జోక్స్ మానసిక వేదనకు గురి చేశాయి. శృతి మించిన జోక్స్ మీద కోపం ప్రదర్శించినా అది షోలో చూపించేవారు కాదు. ఎడిటింగ్ లో తీసేసేవారని అనసూయ చెప్పుకొచ్చారు. రెండేళ్లుగా జబర్దస్త్ వదిలేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు.

జబర్దస్త్ అనంతరం మిగతా షోల నుండి కూడా అనసూయ తప్పుకున్నారు. ప్రస్తుతం పూర్తి సమయం యాక్టింగ్ కి కేటాయిస్తున్నారు. ఏడాదికి అరడజను సినిమాలకు తగ్గకుండా విడుదల చేస్తున్నారు. తాజాగా అనసూయ నటించిన మైఖేల్ విడుదలైంది. సందీప్ కిషన్ హీరోగా నటించాడు. ఐదు భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా మైఖేల్ విడుదల చేశారు. మైఖేల్ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది.

అధికారికంగా అనసూయ పుష్ప 2, రంగమార్తాండ చిత్రాల్లో నటిస్తున్నారు. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన రంగమార్తాండ విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం నుండి ఆమె లుక్ బయటకు రాగా… ప్రెగ్నెంట్ లేడీగా కనిపించారు. ఈ క్రమంలో అనసూయ రోల్ ఆసక్తి రేపుతోంది. ఇక పుష్ప షూట్ ఇటీవలే మొదలైంది. వైజాగ్ షెడ్యూల్ ముగిసినట్లు సమాచారం. మరోవైపు సోషల్ మీడియా వేదికగా గ్లామరస్ ఫోటో షూట్స్ తో అనసూయ అలరిస్తున్నారు.