Anasuya Bharadwaj: కొత్త ఏడాది వస్తుందంటే ప్రతి ఒక్కరూ లక్ష్యాలు నిర్దేశించుకుంటారు. చిన్నదైనా పెద్దదైనా టార్గెట్స్ ఫిక్స్ చేసుకుంటారు. యాంకర్ అనసూయ సైతం 2023కి గాను కొన్ని లక్ష్యాలు ఎంచుకున్నారు.ఆ నాలుగు విషయాలపైనే నా దృష్టి అంటూ కామెంట్ చేశారు. తన టార్గెట్స్ ఏమిటో అనసూయ అభిమానులకు తెలియజేశారు. వాటిలో మొదటిది… టాక్సిక్ పీపుల్ కి దూరంగా ఉండటం. నెగిటివ్ కామెంట్స్ చేసి ఆత్మస్తైర్యం దెబ్బతీసే వాళ్లకు దూరంగా ఉండాలి. ఉన్నా వారిని లక్ష్యపెట్టకుండా ముందుకు వెళ్లడం. వీలైనంత వరకు అవైడ్ చేయాలని మొదటి టార్గెట్ గా పెట్టుకున్నారు.

హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. ఏం చేయాలన్నా ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం, మంచి ఆహారపు అలవాట్లతో ఆరోగ్యంగా ఉండాలని ఆమె సెకండ్ టార్గెట్ ఫిక్స్ చేశారు. తన లక్ష్యాల్లో మూడో స్థానం డబ్బుకు ఇచ్చింది అనసూయ. మోర్ మనీ నా టార్గెట్ అని తెలియజేసింది. గతానికి మించి ఎక్కువ ఈ ఏడాది సంపాదించాలని చెప్పింది. ఇక నాలుగో లక్ష్యంగా పీస్ ఆఫ్ మైండ్ పెట్టుకున్నారు. డబ్బు సంపాదనలో మానసిక ఆరోగ్యం కోల్పోకుండా, నెగిటివ్ కామెంట్స్ ప్రభావానికి లోను కాకుండా… ప్రశాంతమైన జీవనం సాగించాలని చెప్పారు.
ఈ నాలుగు అనసూయ 2023కి తన లక్ష్యాలుగా ఫిక్స్ చేసుకున్నారు. మిగతా వాటి సంగతి ఎలా ఉన్నా… ఎక్కువ డబ్బు సంపాదించాలనే లక్ష్యాన్ని మాత్రం అనసూయ గట్టిగా సాధిస్తారనిపిస్తుంది. డబ్బు సంపాదన కోసమే ఆమె బుల్లితెరను వదిలేసింది. టాలీవుడ్ బిజీ ఆర్టిస్ట్స్ గా మారిన అనసూయ… ఒక్క కాల్షీట్ కి రూ. 3 లక్షలు పైనే తీసుకుంటున్నారట. సినిమాలు, ప్రమోషన్స్, సోషల్ మీడియాతో పాటు ఇతర ఆదాయ మార్గాల ద్వారా అనసూయ నెలకు కోటి నుండి కోటిన్నర రూపాయలు సంపాదిస్తున్నారట.

ఈ మధ్య షాప్ ఓపెనింగ్స్ కి ఎక్కువగా హాజరవుతుంది. ఇది తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు ఇచ్చే ఆదాయ మార్గం. కొత్త షాప్ రిబ్బన్ కటింగ్ సెరిమోని రెండు మూడు గంటలలోపే ఉంటుంది. దానికి అనసూయ ఛార్జ్ రూ. 10 లక్షలకు పైనే అని సమాచారం. ఆ విధంగా సంపాదనలో అనసూయ దూసుకుపోతుంది. ప్రస్తుతం అనసూయ పుష్ప 2లో నటిస్తున్నారు. అలాగే కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ మూవీలో నటిస్తున్నారు. రంగమార్తాండ విడుదలకు సిద్ధం అవుతోంది.