Anand Mahindra: జేసీబీతో ఇలాంటి ఆటలు కూడా ఆడొచ్చా.. అబ్బురపడ్డ ఆనంద్ మహీంద్రా

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సామాజిక మాధ్యమాలలో చురుకుగా ఉంటారు. తనకు ఆసక్తి కలిగించిన విషయాన్ని పంచుకుంటారు. తనకు భిన్నంగా కనిపించిన వీడియోలను, దృశ్యాలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తారు.

Written By: Suresh, Updated On : March 6, 2024 5:22 pm

Anand Mahindra

Follow us on

Anand Mahindra: జేసీబీ లతో ఏం చేస్తారు? పురాతన భవనాలు కూలగొడతారు. కాలువలు తవ్వుతారు. కంప చెట్లను తొలగిస్తారు.. ఇంకా రకరకాల పనులు చేస్తారు. కానీ ఓ యువకుడు జేసీబీ ఖాళీ వాటర్ బాటిళ్ళతో ఒక ఆట ఆడాడు. ఆ ఆట ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ను తెగ ఆకట్టుకుంది. దీంతో ఆ వీడియోను ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సామాజిక మాధ్యమాలలో చురుకుగా ఉంటారు. తనకు ఆసక్తి కలిగించిన విషయాన్ని పంచుకుంటారు. తనకు భిన్నంగా కనిపించిన వీడియోలను, దృశ్యాలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తారు. అందుకే ఆయనను మిలియన్ల కొద్దీ నెటిజన్లు అనుసరిస్తుంటారు. ఆయన ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాకు ఎంతో కొంత సమయం కేటాయిస్తారు.. ఎవరి టాలెంట్ అయినా భిన్నంగా కనిపిస్తే వెంటనే ప్రశంసలు కురిపిస్తారు.. అలాంటి అలాంటి ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఒక వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటున్నది.

మహీంద్రా పోస్ట్ చేసిన వీడియోలో ఓ యువకుడు జేసీబీ ని ఉపయోగించి ఖాళీ వాటర్ బాటిళ్ళతో ఆట ఆడుతున్నాడు. ఐదు వరుసల్లో ఖాళీ వాటర్ బాటిళ్ళ ను పేర్చాడు. వాటర్ బాటిల్ కొన వైపు చాకచక్యంగా కొట్టి దానిని బకెట్లో పడేలాగా ఆపరేట్ చేస్తున్నాడు. ఇలా ఐదు వరుసల్లో వాటర్ బాటిళ్ళు బకెట్లో పడేలాగా చేశాడు. అతని ప్రతిభకు చాలామంది ఫిదా అవుతున్నారు. అందులో ఆనంద మహీంద్రా కూడా ఉన్నాడు. ఈ వీడియో తెగ నచ్చింది కాబట్టే తన ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు..”ప్రతి ఉద్యోగానికి నైపుణ్యం అవసరం. దానిని పెంపొందించుకునేందుకు చాలా సంవత్సరాల శ్రమ అవసరం. కొందరు తమ నైపుణ్యంతో ఇలాంటి ఆటలు ఆడుతారని” మహీంద్రా పేర్కొన్నాడు. ఇప్పటికే ఈ వీడియో మిలియన్ వ్యూస్ నమోదు చేసింది.