Chanakya Niti: విజయం సాధించాలంటే ఏం చేయాలి?

ఆత్మవిశ్వాసం ఉంటే తిరుగు ఉండదని.. ఓడించే వారు కూడా ఎవరు ఉండరని తెలిపారు చాణక్యుడు. జ్నానం ఒక వ్యక్తికి మంచి స్నేహితుడట.. పుస్తక జ్నానం లేదా ఏదైనా పని చేసినప్పుడు అనుభవం ద్వారా వచ్చే జ్నానం ఎప్పుడైనా హృదా కాదని తెలిపారు చాణక్యుడు.

Written By: Swathi, Updated On : March 6, 2024 5:14 pm

Chanakya Niti

Follow us on

Chanakya Niti: ఒక వ్యక్తి జీవితంలో విజయం సాధించాలంటే చాలా కష్టపడాలి. వారికి కొన్ని లక్షణాలు కూడా ఉండాలి. వీటి గురించి చాణక్యుడు వివరించాడు. కొన్ని విషయాలు పాటిస్తే..ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆనందంగా ఉంటారని వివరించారు. ఈయన సూత్రాలను తూ.చ తప్పకుండా పాటించేవారు కూడా ఉన్నారు. మరి విజయం సాధించాలంటే ఆయన ఏం చెప్పారో ఓ సారి తెలుసుకోండి

ఆత్మవిశ్వాసం ఉంటే తిరుగు ఉండదని.. ఓడించే వారు కూడా ఎవరు ఉండరని తెలిపారు చాణక్యుడు. జ్నానం ఒక వ్యక్తికి మంచి స్నేహితుడట.. పుస్తక జ్నానం లేదా ఏదైనా పని చేసినప్పుడు అనుభవం ద్వారా వచ్చే జ్నానం ఎప్పుడైనా హృదా కాదని తెలిపారు చాణక్యుడు. అయితే ఈ జ్నానాన్ని నేర్చుకోవడానికి నిరంతరం కృషి చేయాలన్నారు.

ఒక వ్యక్తి ఏదైనా కావాలని అనుకుంటే దానికి కృషి, సంకల్పం ఉంటే చాలు కచ్చితంగా ఏదైనా సాదించి తీరుతారన్నాడు చాణక్యుడు. ఏదో ఒకరోజు కష్టానికి కచ్చితంగా ఫలితం దక్కితీరుతుంది అని వివరించారు. కష్టపడి పనిచేయడమే విజయానికి మూల సూత్రం అన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా కష్టపడి పనిచేసేవారికి జీవితంలో విజయం సాధ్యం అవుతుంది అని తెలిపారు.

చేసే తప్పుల గురించి తెలుసుకోండం, ఇతరుల నుంచి ఎలాంటి తప్పులు చేయవద్దో నేర్చుకోవడం వంటివి చేయాలన్నారు. తప్పు తెలుసుకొని ఆ తప్పు మళ్లీ చేయకపోతే కూడా విజయాన్ని అందుకోవచ్చట. ఇక ప్రపంచాన్ని నియంత్రించే సాధనం డబ్బు అని.. ధనం ఉన్న వ్యక్తికి బంధువులు పక్కనే ఉంటారన్నారు. డబ్బుంటే తెలివి లేని వాడైనా గొప్పగా కనిపిస్తాడని.. అందుకే డబ్బు సంపాదించాలి అన్నారు చాణక్యుడు.