Nitin Desai Passed Away: ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్ ఆత్మహత్యకు సహకరించారనే ఆరోపణలపై మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ పోలీసులు శుక్రవారం ఎడిల్‌వీస్ గ్రూప్, దాని కంపెనీ ఈసీఎల్ ఫైనాన్స్ అధికారులతో సహా ఐదుగురిపై కేసు నమోదు చేశారు. దేశాయ్ భార్య నేహా దేశాయ్ చేసిన ఫిర్యాదు మేరకు ఖలాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 306(ఆత్మహత్యకు ప్రేరేపణ), 34 (సాధారణ ఉద్దేశ్యం) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఒక అధికారి తెలిపారు. తన కంపెనీ తీసుకున్న అప్పుల విషయంలో తన భర్త పదే పదే మానసిక వేధింపులకు గురిచేస్తున్నాడని, అందుకే ఆత్మహత్య చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. లగాన్, జోధా అక్బర్ వంటి భారీ, సక్సెస్‌ఫుల్ బాలీవుడ్ చిత్రాలకు నితన్ దేశాయ్ పనిచేశారు. రాయ్‌గఢ్ జిల్లాలోని కర్జాత్‌లోని తన స్టూడియోలో బుధవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
రుణాలు తీర్చడంలో విఫలం..
నితిన్ కంపెనీ రుణదాతలకు రూ. 252 కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైంది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ముంబై బెంచ్ దానిపై దివాలా ప్రక్రియను ప్రారంభించింది.
దేశాయ్ కంపెనీ ఆర్ట్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ 2016, 2018లో ఈసీఎల్ ఫైనాన్స్ నుంచి రెండుసార్లు రూ.185 కోట్లు రుణంగా తీసుకుంది. 2020, జనవరి 2020 నుండి తిరిగి చెల్లించడంలో ఇబ్బందులు మొదలయ్యాయి. ఈ క్రమంలో కంపెనీ నుంచి ఒత్తిడి పెరిగింది. మూడేళ్లుగా రుణం తీర్చేందుకు చేస్తున్న ఒత్తిడితో దేశాయ్ మానసికంగా కుంగిపోయాడు. ఈ క్రమంలో రాయ్‌గఢ్ జిల్లాలోని కర్జాత్‌లోని తన స్టూడియో ఆవరణలో బుధవారం ఉదయం శవమై కనిపించాడు.
వేధింపులతోనే ఆత్మహత్య..
ఈ క్రమంలో దేశాయ్ భార్య నేహా దేశాయ్ తన భర్త మరణానికి ఫైనాన్స్ కంపెనీ వేధింపులే కారణమని పోలీసుకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు వివరాలు నమోదుచేసుకున్న పోలీసులు ఎడిల్‌వీస్ గ్రూప్ అనుంబంధ ఫైనాన్స్ కంపెనీ ఈసీఎల్ అధికారులపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా నితిన్ దేశాయ్ తీసుకున్న రూ.185 కోట్ల అప్పు వడ్డీతో కలిపి ప్రస్తుతం రూ.252 కోట్లకు చేరిందని సమాచారం.