Rudra Rachana: ఆ బాలిక చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోతే… ఆమె ఉన్నత విద్యాభ్యాసానికి మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. ఇంజినీరింగ్ పూర్తి చేసేవరకు వెన్నంటి ఉన్నారు. కేటీఆర్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఆ చదువుల తల్లి ఇటీవలే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని సంపాదించింది. అక్కడితో ఆగిపోతే అందరిలో ఒకరిలా మిగిలిపోయేది. కానీ, తనలాంటి అనాథలను ఆదుకోవాలంటూ.. తాజాగా ఆమె తన వేతనంలో రూ.లక్షను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేసి గొప్ప మనసును చాటుకుంది. ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచింది.
What a terrific gesture 👏
Great job Rachana 👍 Your tweet made my day 😊 https://t.co/EfDAFMgH5M
— KTR (@KTRBRS) August 14, 2023
ప్రోత్సహించాలేగానీ..
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తండ్రియాల్ గ్రామానికి చెందిన ఆ యువతి పేరు రుద్ర రచన. ‘తల్లిదండ్రులు లేని రుంద్ర రచనకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అండగా నిలిచారు. కేటీఆర్ ప్రోత్సాహం, ఆర్థిక సహకారంతో ఇటీవలే బీటెక్ పూర్తి చేసింది. ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ కొలువు సంపాదించింది. వెన్నుతట్టి ప్రోత్సహిస్తే అనాథలు కూడా ఉన్నతంగా ఎదుగుతారనడానికి తానే ఒక ఉదాహరణ అంటుంది రుద్ర రచన. అందుకోసమే అనాథలను ప్రోత్సహించేందుకు తన వేతనంలో రూ.లక్షను సీఎం సహాయ నిధికి అందజేసి ఆదర్శంగా నిలిచింది. మంత్రి కేటీఆర్ చేసిన సాయాన్ని ఎప్పటికీ మరువలేను అంటూ ధన్యవాదాలు చెబుతూ సోమవారం ట్వీట్ చేసింది.
స్పందించిన కేటీఆర్…
రచన ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. సంతోషం వ్యక్తం చేస్తూ రీ ట్వీట్ చేశారు. ‘ఎంత అద్భుతమైన ఆలోచన. చాలా గొప్ప పని చేశావు రచన. నీ ట్వీట్ చూసి నా మనసు ఆనందంతో నిండిపోయింది’ అని భావోద్వేగాన్ని వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా చదువు కోసం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆర్థిక సాయాన్ని అందుకుంటున్న రచన ఫొటోను, బీటెక్ పూర్తయిన అనంతరం ఆమె తనకు రాఖీ కడుతున్న ఛాయాచిత్రాన్ని, ముఖ్యమంత్రి సహాయ నిధికి రచన రూ.లక్ష అందజేసిన సందర్భంగా ఇచ్చిన అధికారిక ధ్రువపత్రాన్ని… ట్విటర్‌లో కేటీఆర్ పంచుకున్నారు.
ఎంతో మందికి స్ఫూర్తి..
తల్లిదండ్రులు కష్టపడి అన్ని సౌకర్యాలు సమకూరుస్తున్నా.. చదవడానికి ఇబ్బంది పడుతున్న నేటి తరం విద్యార్థులు.. కష్టపడకుండానే నాకు ఉద్యోగం రావడం లేదని ప్రభుత్వాలను, కంపెనీలను నిందిస్తున్న నిరుద్యోగులకు రుద్ర రచన స్ఫూర్తిగా నిలిచింది. ఎవరూ లేరన్న బాధను దిగమించుకుని వెన్నుతట్టి ప్రోత్సహించిన వారికి మాట రాకుడాదన్న సంకల్పంతో ఉన్న చదువులు చదవడంతోపాటు కొలువ సాధించడం అభినందనీయం. అంతేకాదు తనలాంటి అనాథలు ఎంతో మంది ఉన్నతంగా ఎదగాలన్న రచన ఆకాంక్ష నెరవేరాలని ఆశిద్దాం.