Viral Video: సోషల్ మీడియా పెరిగినప్పటి నుంచి వ్లాగర్లు, ఇన్‌ఫ్ల్యూయన్సర్లు ఇష్టం వచ్చిన రీతిలో రీల్స్ చేస్తూ పోస్ట్ చేస్తూ వైరల్ అవుతున్నారు. వారు ప్రాణాపాయానికి గురవడం మాత్రమే కాదు.. ఇతరులకు కూడా ఇబ్బంది కలిగిస్తున్నారు. రీల్స్ పిచ్చిలోపడి కొందరు ప్రాణాలు కోల్పోయారు. పెద్ద పెద్ద లోయల వద్ద రీల్స్ చేస్తూ అందులో పడిన వారు చాలా మంది ఉన్నారు. ఇక పెద్ద పెద్ద భవంతులపై, రైల్వే బ్రిడ్జిలపై ఇలా పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. ఇలానే ఇటీవల బంగ్లాదేశ్ లో ఒక ఇండియన్ వ్లాగర్ చేసిన వీడియో వైరల్ గా మారింది. 29,000 మంది ఫాలోవర్స్ ఉన్న ఒక వ్లాగర్ రైలు సర్ఫింగ్ చేశాడు. బంగ్లాదేశ్ లో చేసిన ఆయన వీడియోను చూసి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ స్టా కంటెంట్ సృష్టికర్త రాహుల్ గుప్తా ఈ ప్రమాదకరమైన స్టంట్ చేస్తూ వీడియోను పోస్ట్ చేశాడు. వీడియోలో, గుప్తా వేగంగా వెళ్తున్న రైలు పైకప్పుపై బోర్లాగా పడుకొని జాగ్రత్తలను పట్టించకుండా తనను తాను (సెల్ఫీ వీడియో) చిత్రీకరించడం చూడవచ్చు. గుప్తా ‘థ్రిల్లింగ్’గా ఫీలవుతున్నట్లు చెప్పాడు. అతని చర్యలు ఆన్‌లైన్‌లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఇవి విపరీతమైన ప్రమాదాలకు కారణం అవుతాయని ప్రజలు మండిపడుతున్నారు. యువ ప్రేక్షకులపై వాటి ప్రభావం పడుతుందని ఆందోళనలను పెంచుతుంది.
రాహుల్ గుప్తా ఇటీవల బంగ్లాదేశ్ లో పర్యటించారు. పర్యటనలో భాగంగానే రైలు పైకప్పుపై ప్రమాదకర స్టంట్ చేశాడు. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి వీడియోలను కొందరు వ్లాగర్స్, ఇన్ఫుయెన్సర్లు చేయడం సాధారణంగా మారింది. క్లిప్‌లో, గుప్తా ట్రాక్‌పై వేగంగా వెళ్తున్నప్పడు రైలు పైకప్పుపై బోర్లా పడుకొని ఉంటూ సెల్ఫీ వీడియోను తీశాడు. వీడియోను పరిశీలిస్తే పైన విద్యుత్ లైన్ లేని రైలుగా కనిపిస్తుంది. ఒక వేళ విద్యుత్ లైన్ వస్తే పరిస్థితి ఏంటి? ఒక వేళ రైలు వేగానికి తట్టుకోలేక కిందపడిపోతే రెండు ప్రమాదకరమైనవే. రెండు విధాలుగా ప్రాణాలు పోయే ఛాన్స్ ఉంది.
రైలుకు సంబంధిత కంటెంట్ రూపొందించడంలో గుప్తా గుర్తింపు దక్కించుకున్నాడు. అయితే ప్రమాదకరమైన విన్యాసాలు చేయడం ఇతనికి కొత్తేమి కాదు. ఇతని ఇన్ స్టా ఫీడ్ ఎక్కువగా రైళ్లకు, రైలు ప్రయాణాలకు సంబంధించినవే ఉన్నాయి. కదిలే కోచ్‌లపై ప్రయాణించడం, అనుమతి లేకుండా రైలు ఇంజిన్‌లోకి ప్రవేశించడం వంటి వీడియోలలు ఇతని అకౌంట్ లో ఉన్నాయి. ఈ కంటెంటే అతను ఫేమస్ అయ్యేలా సాయ పడింది. 19 మిలియన్లకు పైగా వీక్షణలను ఈ వీడియో సంపాదించింది.
గుప్తా వీడియోపై విశ్రమ స్పందనలు కనిపిస్తున్నాయి. ఇది నిర్లక్ష్యమే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి విన్యాసాలు చేయవద్దని కొందరు వివరిస్తున్నారు. ఇది కేవలం చెత్త పని మాత్రమే అని అంటున్న వారు లేకపోలదు. ఒకరు ఇలా స్పందించారు. ‘ఇది నిర్లక్ష్యం కాదు అంతకు మించినది! వ్యూవ్స్ కోసం జీవితాన్ని పణంగా పెట్టాడు. ఎవరు ఏమన్నా.. ఎన్ని వ్యూవ్స్ వచ్చినా ఇది ముమ్మాటికి తప్పేనంటున్నారు. దీన్ని చూసిన కొందరు యువకులు ఇలాంటి స్టంట్స్ చేస్తే బాధ్యత ఎవరిది అంటూ ప్రశ్నిస్తున్నారు. అధికారులు అతనిపై చర్యలు తీసుకోవాల్సిందే అంటున్న వారు ఉన్నారు. ఇది ధైర్యం కాదు-ఇది మూర్ఖత్వం. దీన్ని ఎంకరేజ్ చేయకూడదు. అంటూ రక రకాలుగా స్పందిస్తున్నారు.
రైలుపై వేలాడుతూ వీడియో.. విమర్శలు
సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు వీడియో కంటెంట్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు.
రాహుల్ గుప్తా అనే వ్లాగర్ బంగ్లాదేశ్ లో రైలుపై వేలాడుతూ వీడియో తీసి ఇన్‌స్టాలో పెట్టారు. 20 మిలియన్ వ్యూస్ తో ఆ వీడియో వైరల్ అయింది.
అతడి చర్యపై నెటిజన్ల నుంచి ఆగ్రహం… pic.twitter.com/jFkAPtsQfk
— Tupaki (@tupaki_official) December 18, 2024
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: An indian vlogger filmed himself a speeding train in bangladesh
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com