Indian Techie: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో ప్రకారం.. కెనడాలోని టొరంటో ప్రాంతంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న యువతి తన బాధను మొత్తం వ్యక్తం చేసింది. ఆమె ప్రతి ఏడాది 75 లక్షల వరకు వేతనం సంపాదిస్తోంది. అయినప్పటికీ ఆమె జీవితంలో సుఖం లేదట. జీవితాన్ని ఆహ్లాదంగా గడిపే అవకాశం లేదట. వస్తున్న జీతానికి.. పెడుతున్న ఖర్చుకు లంకె కుదరకపోవడంతో ఇబ్బంది పడాల్సి వస్తోందట. ” నేను మూడు సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఓ పేరు పొందిన ఓ కంపెనీలో ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్నాను. ప్రతి ఏడాది నాకు 75 లక్షల కుమించి వేతనం వస్తుంది. ఆ స్థాయిలోకి వచ్చినప్పటికీ నాకు పెద్దగా మనశ్శాంతి లేదు. ఇక్కడ ద్రవ్యోల్బణం తారస్థాయిలో ఉంది. గతంలో ఒక బట్టర్ బ్రెడ్ ధర నాలుగు డాలర్లుగా ఉండేది. ఇప్పుడు అది 8 డాలర్లకు పెరిగింది. నేను ఉంటున్న గదికి 1600 డాలర్లు చెల్లించాల్సి వస్తోంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఖర్చులకు తగ్గట్టుగా వేతనాలు పెరగడం లేదు. కంపెనీలు ఆ దిశగా ఆలోచించడం లేదు. అందువల్లే సంవత్సరానికి 75 లక్షలకు పైగా సంపాదించినప్పటికీ ఉపయోగం లేకుండా పోతోంది. అదే భారత్ లో అయితే 25 నుంచి 30 వేల మధ్య సంపాదిస్తే ఎలాగైనా బతకచ్చు. ఆర్థిక మాంద్యం వంటి వాటిని కూడా ఎదుర్కోవచ్చు. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ప్రతిదీ డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. చిన్న సౌకర్యం కూడా డబ్బుతోనే పొందాల్సి ఉంటుందని” ఇండియన్ మూలాలు ఉన్న ఆ ఐటి ఉద్యోగి చెప్పుకొచ్చింది.
సోషల్ మీడియాలో..
ఆ వీడియోను పీయూష్ మొంగా అనే వ్యక్తి తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అతడు ఒక యూట్యూబర్. డాలర్ డ్రీమ్స్ నేపథ్యంలో విదేశాలకు వెళ్లి.. అక్కడ సంపాదిస్తున్న వారి వివరాలను తెలుసుకుంటాడు. అలాగే టొరంటోలో ఉద్యోగం చేస్తున్న ఆ భారతీయ మూలాలు ఉన్న యువతిని వేతనం, ఇతర విషయాల గురించి ప్రశ్నిస్తే పై సమాధానాలు చెప్పింది. అయితే ఆ యువత చెప్పిన సమాధానాల నేపథ్యంలో నెటిజన్లు స్పందిస్తున్నారు. ” బుద్ధిగా ఇండియాలో ఉండి ఏదో ఒక ఉద్యోగం చేసుకోక.. అక్కడిదాకా వెళ్లడం ఎందుకు.. అలా ఇబ్బందులు పడడం ఎందుకు? పాశ్చాత్య దేశాలలో ఎలా ఉంటుందో తెలియదా? అక్కడ ప్రతిదీ డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. ఆ డబ్బును ఎంత బాగా సంపాదిస్తే అక్కడ అంత సుఖంగా జీవితాన్ని పొందొచ్చు. అంతేతప్ప వచ్చిరాని జీతాలతో అమెరికాలో బతకడం అంటే చాలా కష్టమని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. వీలైనంత తొందరలో ఇండియాకు వచ్చి ఇక్కడే స్థిరపడాలని ఆ యువతికి సూచిస్తున్నారు. దూరపు కొండలు నునుపు అనే సామెతను ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని ఆ యువతికి హితవు పలుకుతున్నారు. కాగా, ఆ యువతి చేసిన వ్యాఖ్యలు పాశ్చాత్య దేశాలలో పెరిగిపోయిన ద్రవ్యోల్బణాన్ని నిరూపిస్తున్నాయని మరికొంతమంది నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More