Illegal Affair : భర్త యువతితో.. భార్య స్నేహితురాలి భర్తతో.. చివరకు షాకింగ్ ట్విస్ట్

ముందస్తుగా ప్రణాళిక ప్రకారం శశికుమార్ తన వద్ద ఫారిన్ లిక్కర్ ఉందని చెప్పి రాజశేఖర్ ను ఒంటరిగా తీసుకెళ్లాడు. అప్పటికే మద్యంలో విషం కలిపి ఇవ్వడంతో రాజశేఖర్ స్పృహతప్పి పడిపోయాడు. కొద్దిసేపటికే మృతిచెందాడు.

Written By: Dharma, Updated On : June 2, 2023 5:39 pm
Follow us on

Illegal Affair :  ఓ యువతితో వివాహేతర సంబంధానికి అలవాటుపడిన వ్యక్తి భార్య, పిల్లలను నిర్లక్ష్యం చేశాడు. దీంతో భార్య తన స్నేహితురాలి భర్తతో సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో భర్త వేధింపులు అధికమయ్యాయి. ఎలాగైనా వదిలించుకోవాలనుకున్న భార్య… తన స్నేహితురాలితో పాటు ఆమె భర్త, తన రహస్య ప్రియుడైన వ్యక్తితో భర్తతో కలిసి మట్టుబెట్టింది. మృతదేహాన్ని చెరకు తోటలో పడేసింది.చివరకు పోలీసుల దర్యాప్తులో భార్య ఈ  ఘాతుకానికి కారణమని తేలింది. సహకరించిన ప్రియుడు, ఆయన భార్య సైతం కటకటలాపాలయ్యారు.

తమిళనాడులోని కడలూరు జిల్లా కుల్లంజవాడి సమీపంలోని టీ. పాళ్యంలో చెరకు తోటలో గుర్తుతెలియని మృతదేహం వెలుగుచూసింది. తోటలోకి పనికి వెళ్లిన వారికి కుళ్లిపోయి దుర్వాసన వస్తున్న మృతదేహం కనిపించింది. సమాచారమందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. మృతుడు వడలూరు పార్వతీపురానికి చెందిన రాజశేఖర్ అని  విచారణలో తేలింది. తీగ లాగడంతో డొంక కదిలింది. భార్య మంజుల వాంగ్మూలంతో పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి.

రాజశేఖర్, మంజుల దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మరో యువతితో రాజశేఖర్ కు వివాహేతర సంబంధం ఉంది. ఆమెను కలుసుకునేందుకు  రాజశేఖర్ తరచూ తిరుపూర్ వెళ్లేవాడు. కుటుంబానికి ఏ ఆసరా లేకుండా పోయింది.  ఇదే సమయంలో మంజుల ఆమె స్నేహితురాలు వినోధిని భర్త శశికుమార్ తో  అక్ర మసంబంధం పెట్టుకుంది. ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్న రాజశేఖర్ రోజు రాత్రి పూట మద్యం తాగి వచ్చి అతని భార్య మంజులను లైగింకంగా వేధించేవాడు. విసిగివేశారిపోయిన మంజుల స్నేహితురాలు, ఆమె భర్తకు విషయం చెప్పింది.

ముగ్గురూ కలిసి రాజశేఖర్ ను చంపేందుకు డిసైడయ్యారు. ప్లాన్ లో భాగంగా తన ఇంటిలో జరిగే పార్టీకి వినోధిని, ఆమె భర్త శశికుమార్ ను మంజులా ఆహ్వానించింది. ముందస్తుగా ప్రణాళిక ప్రకారం శశికుమార్ తన వద్ద ఫారిన్ లిక్కర్ ఉందని చెప్పి రాజశేఖర్ ను ఒంటరిగా తీసుకెళ్లాడు. అప్పటికే మద్యంలో విషం కలిపి ఇవ్వడంతో రాజశేఖర్ స్పృహతప్పి పడిపోయాడు. కొద్దిసేపటికే మృతిచెందాడు. శవాన్ని చెరుకు తోటలో విసిరేసిన ముగ్గురు అక్కడ నుంచి వెనుదిరిగారు. వినోధిని తన కుటుంబంతో కొడైకెనాల్ విహార యాత్రకు వెళ్లినట్టు మంజులా చెప్పుకొచ్చింది. దీంతో ముగ్గుర్ని కడలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తండ్రి మరణం, తల్లి జైలుపాలు కావడంతో ముగ్గురు కుమార్తెలు అనాథలయ్యారు.