Afghanistan: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో ప్రకారం.. బలంగా ఉన్న ఓ వ్యక్తి చిరుతపులిని మోసుకుంటూ కనిపించాడు. ఈ సంఘటన ఆఫ్ఘనిస్తాన్ లో చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం పూర్తి విభిన్నంగా ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ ఉత్తర ప్రాంతంలో అడవులు విస్తారంగా ఉంటాయి. ఆ ప్రాంతాలలో జంతువులు విస్తారంగా ఉంటాయి. పులులు, చిరుతపులులు, జింకలు, ఏనుగులు, దుప్పులు విరివిగా కనిపిస్తాయి. ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో అభివృద్ధి అంతంత మాత్రమే కాబట్టి ఆ ప్రాంతంలో అడవి జంతువుల మనుగడకు పెద్దగా ముప్పు ఉండదు. అరుదైన సందర్భాల్లో మాత్రమే ఆ జంతువులు అప్పుడప్పుడు గ్రామాల్లోకి వస్తుంటాయి. ఆ సమయంలో ప్రాణ రక్షణ కోసం గ్రామస్తులు ఆ జంతువులను తరిమికొడతారు.. అంతేతప్ప ప్రాణహాని తలపెట్టరు. ఇక తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ను చేజిక్కించుకున్న తర్వాత అక్కడ జంతువుల పరిరక్షణ కాస్త దారితప్పింది. ముఖ్యంగా జంతుప్రదర్శనశాలలో ఉన్న జంతువులకు సరిగా ఆహారం అందకపోవడంతో అవి తప్పించుకుపోతున్నాయి.. అలా ఓ చిరుత పులి ఆహారం అందక దారి తప్పించుకొని గ్రామాల్లోకి ప్రవేశించింది. దీంతో గ్రామస్తులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం తెలియజేయడంతో వారు రంగంలోకి దిగారు..
మత్తుమందు లేకపోవడంతో
గ్రామాల్లోకి వచ్చిన చిరుత ప్రజలను చాలా ఇబ్బంది పెడుతోంది. చాలా రోజుల నుంచి ఆకలితో ఉన్నదేమో.. సమీపంలో ఉన్న ఆవుల మందపై దాడి చేసింది. అయితే ఆ సమయానికి అక్కడే రైతులు ఉండడంతో దానిని తరిమికొట్టారు. ఈ లోగానే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో వారు రంగంలోకి దిగారు. తాలిబన్ల పరిపాలన కాలంలో అటవీశాఖకు పెద్దగా కేటాయింపులు లేవు. దీంతో ఆ చిరుత పులి దూకుడును నిలుపుదల చేయడానికి చివరికి మత్తు మందు కూడా లేకపోయింది. దీంతో అటవీ శాఖలో పనిచేసే అధికారి నేరుగా రంగంలోకి దిగాడు. ఉన్నట్టుండి ఆ చిరుత పులిని అమాంతం పట్టుకున్నాడు. భుజాలకు ఎత్తుకున్నాడు. అంతే వేగంగా దగ్గర్లో ఉన్న జంతు ప్రదర్శనశాలకు వెళ్ళాడు. లిప్తపాటు కాలంలో చిరుతపులిని ఎత్తుకొని అతడు పరుగు తీసిన విధానం చుట్టుపక్కల ఉన్న వారికి షాక్ కలిగించింది. సాధారణంగా చిరుత పులి చాలా బరువుంటుంది. పైగా విపరీతమైన కోపంతో ఉంటుంది. దానిని అమాంతం అలా ఎత్తుకోవడం నిజంగా ఆశ్చర్యం అనిపించింది. అటవీశాఖాధికారి చిరుతపులిని అలా ఎత్తుకొని పరుగులు పెట్టడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఆ వీడియో మిలియన్ల కొద్దీ వీక్షణలు సొంతం చేసుకుంది. ఆ వీడియోని చూసిన నెటిజన్లు.. ఏం గుండెరా వాడిది.. ఆ గుండె కలకాలం బతకాలని.. వాడి సేవలను ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం గుర్తించాలని కామెంట్స్ చేస్తున్నారు.
https://www.youtube.com/watch?v=41TzNJfgLb4&ab_channel=UnexploredNature