Ghotul Tribe: పెళ్లికి ముందు శృంగారం.. శారీరక సంబంధం పెట్టుకోవడం పాశ్చాత్య దేశాల్లో సర్వసాధారణం. సంప్రదాయాలకు, వివాహ కట్టుబాట్లకు విలువనిచ్చే మన దేశం మాత్రం అందుకు అంగీకరించదు. కానీ మన దేశంలోనే మారుమూల ప్రాంతాల్లో ఇలాంటి సంప్రదాయమే కొనసాగుతోంది. వినడానికి వింతగా ఉంది కదూ.. కానీ మీరు విన్నది నిజమే. దాని గురించి ఒకసారి తెలుసుకుందాం.
చత్తీస్ గడ్లోని బస్తర్ జిల్లా నక్సల్స్ ప్రభావిత ప్రాంతం. అక్కడ గోండు, మురియా తెగకు చెందిన గిరిజనులు నివసిస్తారు. వీరి ఆచార సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి. సాధారణంగా శృంగారం గురించి బహిరంగంగా మాట్లాడడం మనదేశంలో తప్పుగా భావిస్తారు. కానీ ఈ గిరిజన తెగల్లో మాత్రం అది సర్వసాధారణం. ప్రేమించుకోవడం, కలిసి తిరగడం, శృంగారంలో పాల్గొనడం బాహటంగానే జరుగుతాయి ఇక్కడ. 10 సంవత్సరాల తరువాత బాల బాలికలకు ఇక్కడ స్వేచ్ఛ ఇస్తారు. వారు ప్రేమించవచ్చు. కలిసి తిరగవచ్చు. సహజీవనం చేయవచ్చు. ఒకరినొకరు అర్థం చేసుకొని.. పెళ్లి చేసుకోవచ్చు.
ఇక్కడి గిరిజనులు ఘోతుల్ సంప్రదాయాన్ని పాటిస్తారు. నచ్చినవారు కలుసుకునేందుకు ఒక డార్మెటరీ నిర్మిస్తారు. అడవి ప్రాంతంలో పెద్ద పెద్ద వెదురు బొంగులతో ప్రేమికులు ఏకాంతంగా గడిపేందుకు ఒక డార్మెటరీ ఏర్పాటు చేస్తారు. పదేళ్లు నిండిన పిల్లలు ఎవరైనా వీటిలోకి వెళ్ళవచ్చు. తల్లిదండ్రులు సైతం అభ్యంతరం చెప్పరు. పెళ్లికి ముందే శారీరకంగా కలిసే వెసులుబాటు కూడా ఉంటుంది. ఎలాంటి సామాజిక ఒత్తిడి లేకుండా తమ భాగస్వామిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఇక్కడి వారికి ఉంటుంది. ఘోతుల్ సంప్రదాయం ప్రకారం యువతీ యువకులు ప్రత్యేక నృత్యాలు చేస్తుంటారు. యువకులు తమ ప్రేయసికి వెదురు బొంగు తో తయారుచేసిన దువ్వెనలను ఇస్తుంటారు. ఆ దువ్వెనలను ఆమె తలలో ఉంచుతారు. అలా ఉంచుకుంటేనే ఇష్టపడినట్టు. ఆయనతో కలిసేందుకు మొగ్గు చూపినట్టు. శారీరక సంబంధానికి అంగీకారం తెలిపినట్టు. కొన్ని నెలల తరువాత వీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడితే ఇరు కుటుంబాల పెద్దలు వివాహాలు చేస్తారు. అయితే ఈ క్రమంలో నెలల తరబడి సహజీవనం చేసిన వారు ఉంటారు. గర్భం దాల్చిన తర్వాత పెళ్లి చేసుకున్నవారు ఉంటారు. ఈ భిన్న సంప్రదాయంతో తమ ప్రాంతంలో లైంగిక వేధింపులు ఉండవని గిరిజనులు చెబుతున్నారు. వింతగా ఉంది కదూ ఈ సంప్రదాయం.