Ambani Electricity Bill: ముకేశ్ అంబానీ.. భారత దేశ కుబేరుడు. రిలయన్స్ ఇండస్ట్రీస్ (Relance Indastrees)అధినేత. ఇటీవలే తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ(Ananth Ambani) పెళ్లిని కనీ విని ఎరుగని రీతిలో జరిపించారు. ఇక అంబానీ ఇల్లు ముంబై(Mumbai)లో ఉంది. అత్యంత ఖరీదైన, విలాసవంతమైన ఇల్లు అంది ఆయన ఇంటి నెల కరెంటు బిల్లుతో సామాన్యుల లైఫ్ సెట్ అవుతుంది.
వేసవి కాలంలో ఎండలు మండిపోతుంటే, ఇళ్లల్లో ఏసీలు, ఫ్యాన్లు, ఇతర ఎలక్ట్రానిక్(Electronic) ఉపకరణాల వాడకం పెరిగి కరెంట్ బిల్లులు ఆకాశాన్నంటుతాయి. సామాన్యులకు ఈ బిల్లులు వందలు లేదా వేల రూపాయల్లో ఉంటాయి. కానీ, ముంబైలోని ప్రపంచ కుబేరుడు ముకేశ్ అంబానీ నివాసం ‘అంటిలియా’(Antilia)కు వచ్చిన ఒక నెల విద్యుత్ బిల్లు ఏకంగా రూ.70,69,488గా ఉందని రిపోర్లులు వెల్లడించాయి. ఈ భారీ మొత్తం ఒక సామాన్య కుటుంబం జీవితాంతం గడిపేంత సౌలభ్యాన్ని అందిస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంబానీ సకాలంలో బిల్లు చెల్లించడంతో రూ.48,354 డిస్కౌంట్ కూడా పొందారు.
ప్రపంచంలోనే రెండో ఖరీదైన నివాసం
ముంబైలోని అల్టామౌంట్(Altamount)రోడ్డులో 27 అంతస్తులతో నిర్మితమైన అంటిలియా, ప్రపంచంలోనే రెండో అత్యంత ఖరీదైన ఇంటిగా గుర్తింపు పొందింది. 4,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనం అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఒక విలాసవంతమైన నివాసం. 2006–2010 మధ్య నిర్మితమైన దీని అంచనా వ్యయం ఆ సమయంలో రూ.15,000 కోట్లు (సుమారు 2 బిలియన్ డాలర్లు). అమెరికన్ ఆర్కిటెక్చర్ సంస్థ పెర్కిన్స్ – విల్ రూపొందించిన ఈ భవనం, రిక్టర్ స్కేలుపై 8 తీవ్రత భూకంపాలను కూడా తట్టుకునేలా డిజైన్ చేయబడింది.
అంటిలియా లోపలి సౌలభ్యాలు
థియేటర్, స్విమ్మింగ్ పూల్స్: 50 సీట్ల సామర్థ్యం గల హోమ్ థియేటర్, బహుళ స్విమ్మింగ్ పూల్స్ ఈ భవనంలో ఉన్నాయి.
స్పా, ఆలయం: విశ్రాంతి కోసం ఒక స్పా, ఆధ్యాత్మికత కోసం ఒక ఆలయం ఏర్పాటు చేశారు.
కృత్రిమ మంచు: వేసవిలో ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం కత్రిమ మంచుకొండల నుంచి మంచు కురిసే సాంకేతికత ఉంది.
గ్యారేజీ, హెలిప్యాడ్లు: 168 కార్లు నిలిపే సామర్థ్యం గల గ్యారేజీ, మూడు హెలిప్యాడ్లు ఈ ఇంటి విశేషాలు.
సిబ్బంది: ఈ భవన నిర్వహణ కోసం సుమారు 600 మంది సిబ్బంది నిరంతరం పనిచేస్తారు.
భారీ విద్యుత్ వినియోగం ఎందుకు?
అంటిలియాలోని అత్యాధునిక సౌలభ్యాలు, ఏసీలు, లైటింగ్ సిస్టమ్స్, ఎలివేటర్లు, స్విమ్మింగ్ పూల్స్ వంటివి నిరంతరం విద్యుత్‌ను వినియోగిస్తాయి. వేసవిలో ఈ సౌకర్యాల వాడకం మరింత పెరగడంతో బిల్లు రూ.70 లక్షలకు చేరిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు, ఈ భవనంలో ఉపయోగించే ఎలక్ట్రానిక్ ఉపకరణాలు అత్యంత శక్తివంతమైనవి కావడం కూడా ఒక కారణం.
సామాన్యులతో పోలిక
సామాన్య కుటుంబాలకు వేసవిలో రూ.2 వేల – రూ.5 వేల మధ్యలో ఉండే బిల్లులతో పోలిస్తే, అంటిలియా బిల్లు ఊహకందనిది. ఈ మొత్తంతో ఒక సాధారణ కుటుంబం దశాబ్దాల పాటు విద్యుత్ ఖర్చులను భరించవచ్చు. అంబానీ కుటుంబం యొక్క జీవనశైలి, వారి నివాసం యొక్క విలాసవంతమైన సౌకర్యాలు ఈ భారీ బిల్లుకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.