He Teams: ట్రెయిన్ రివర్స్ అయ్యింది. ఒకప్పుడు ఆడవాళ్లు(Ladies) వంటింటి కుందేళ్లుగా ఉండేవారు. మగాళ్లు ఆదిపత్యం చెలాయించేవారు. కానీ రోజులు మారాయి. సమాజం మారింది. అతివలకు ఎక్కడలేని అధికారాలు, చట్టాలు, ప్రత్యేక వ్యవస్థలు వచ్చాయి. దీంతో కొందరు దీన్ని మిస్ యూజ్ చేస్తున్నారు. మహిళల వేధింపుల(Harasment) వల్ల ఆత్మహత్య చేసుకుంటున్న పురుషుల జీవితాలు కళ్లముందు కనిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఆడవాళ్లకు షీటీంలు లాగానే మగాళ్లకు ‘హీ టీం’లు రావాలని హైదరాబాద్‌లో బాధిత మగాళ్లు అందరూ ధర్నా చేసిన వైనం చర్చనీయాంశమైంది. ఆ ధర్నా ఏంటి? వారి బాధలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
గత కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీ(Cinima Industree)లో మగ సెలబ్రిటీలు ‘ఆడవాళ్ల వల్ల మాకు ఇబ్బందులు‘ అంటూ గగ్గోలు పెడుతున్నారు. ‘మా పేరు, గుర్తింపు చూసి పగలు తీర్చుకుంటున్నారు‘ అని కొందరు ఆరోపిస్తే, ‘ఆడవాళ్ల నుంచి మగవాళ్లను కాపాడండి‘ అంటూ రోడ్డెక్కిన వీరుడూ ఉన్నాడు. ఇందులో హైలైట్ ఎవరో తెలుసా? మన బిగ్ బాస్ స్టార్ శేఖర్ భాష! ఈయన అడ్వకేట్ల(Adwacates) సాయంతో ఇందిరా పార్క్(Indira Park) వద్ద ధర్నా చేసి, ‘షీ టీమ్స్ ఉన్నట్టు హీ టీమ్స్(He teams) పెట్టండి‘ అని డిమాండ్ చేశాడు. ‘ఆడవాళ్లు మగవాళ్లను చిత్రవధ చేస్తున్నారు, కేసుల్లో ఇరికిస్తున్నారు‘ అంటూ గోల గోల చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాడు.
మగవాళ్లకు లేదు..
శేఖర్ భాష ప్రకారం, ‘ఆడవాళ్లకు రక్షణ ఉంది, మగవాళ్లకు లేదు. మేం కూడా బాధితులం!‘ అంటూ గట్టిగా అరిచాడు. అయితే, నెటిజన్లు మాత్రం ‘బాషా, నీకు పాపులారిటీ కావాల్సి వచ్చినప్పుడల్లా ఇలా డ్రామాలు ఆడతావా?‘ అంటూ ఫైర్ అయ్యారు. ‘మొన్న రాజ్ తరుణ్–లావణ్య కేసులో హీరోలా కనిపించావు, ఇప్పుడు మగవాళ్ల రక్షకుడిలా రోడ్డెక్కావు. ఏంట్రా నీ ప్లాన్?‘ అని కామెంట్లు పేల్చారు. ‘బిగ్ బాస్ కి వెళ్లి గుర్తింపు తెచ్చుకున్నావు, ఇప్పుడు మళ్లీ స్పాట్‌లైట్ కోసం ఈ నాటకం‘ అని ఒకడు సెటైర్ వేస్తే, ‘ఇన్నాళ్లు ఎక్కడున్నావ్ బాషా? లావణ్య కేసు తర్వాతనే కదా నీకు ఈ ‘మగ రక్షణ’ గుర్తొచ్చింది‘ అని మరొకడు గట్టిగా ఇచ్చిపడేశాడు.
అసలు విషయం ఏమిటంటే..
శేఖర్ భాష ఈ గోలతో మగవాళ్ల సమస్యల్ని లేవనెత్తాడో లేదో కానీ, నెటిజన్ల మాటల్లో చిక్కుకుని ట్రోల్ బాధితుడైపోయాడు. ‘ఆడవాళ్ల వల్ల మగవాళ్లకు హాని ఉందంటావు, కానీ నీ వల్ల మా టైమ్‌లైన్‌కే హాని‘ అని ఒక నెటిజన్ సెటైరికల్‌గా రాస్తే, ‘హీ టీమ్స్ కాదు, నీకు హిట్ టీమ్ కావాలి‘ అని మరొకడు వేళాకోళం చేశాడు. ఇక శేఖర్ భాష ఈ ట్రోలింగ్‌కి ఏం సమాధానం చెబుతాడో చూడాలి, లేక మళ్లీ కొత్త డ్రామాతో రిటర్న్ ఇస్తాడో వేచి చూద్దాం!
HE టీమ్స్ ఏర్పాటు చేయాలని ఇందిరా చౌక్ వద్ద ధర్నా
మగవారికి జరుగుతున్న అన్యాయాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
పాల్గొన్న బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ బాషా, అడ్వకేట్లు
SHE టీమ్స్ తరహాలో HE టీమ్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ pic.twitter.com/KbJhRZjjBP
— BIG TV Breaking News (@bigtvtelugu) April 5, 2025