Allu Arvind- Anupama Parameswaran: అల్లు అరవింద్ యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ని బన్నీకి చెల్లిని చేశాడు. 18 పేజెస్ ప్రమోషనల్ ఈవెంట్ లో అల్లు అరవింద్ అనుపమపై చేసిన కామెంట్స్ అలాంటి అర్థం ఇచ్చాయి. సుకుమార్ రైటింగ్స్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్స్ సంయుక్తంగా 18 పేజెస్ టైటిల్ తో రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ నిర్మించారు. దర్శకుడు సుకుమార్ ఈ చిత్రానికి కథ సమకూర్చారు. అల్లు అరవింద్ 18 పేజెస్ చిత్ర సమర్పకుడిగా ఉన్నారు. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్స్ గా నటించారు.

18 పేజెస్ మూవీ డిసెంబర్ 23న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. మరో పది రోజుల సమయం మాత్రమే ఉండగా ప్రమోషన్స్ షురూ చేశారు. 18 పేజెస్ ప్రమోషనల్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనుపమకు సింగింగ్ టాలెంట్ కూడా ఉంది. 18 పేజెస్ లోని ఒక రొమాంటిక్ మెలోడీ సాంగ్ అనుపమ వేదికపై పాడారు. అనుపమ అద్భుతమైన స్వరానికి ఆడియన్స్ ముగ్దులు అయ్యారు.
అనంతరం అల్లు అరవింద్ కేరళ కుట్టి అనుపమపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఆయన మాట్లాడుతూ… అనుమప గురించి మాట్లాడకుండా ఉండలేను. ఆమెను చూసినప్పుడల్లా అనుపమ లాంటి కూతురు ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఆమెకు బయట నటించడం రాదు. మనసులో ఉన్నది ముఖంలో కనిపిస్తుంది. ముక్కుసూటిగా మాట్లాడుతుంది. అనుపమ చాలా ట్రాన్స్పరెంట్ అందుకే అనుపమ అంటే నాకు చాలా ఇష్టం, అని ఆమెపై తనకున్న ప్రేమాభిమానాలు చాటుకున్నాడు.

అనుపమను కూతురుగా ఫీలైన అల్లు అరవింద్ కొడుకు అల్లు అర్జున్ కి చెల్లిని చేశాడన్న మాట. అల్లు అరవింద్ కి ముగ్గురు కొడుకులే కాగా అమ్మాయిలు లేరు. అల్లు వెంకట్ నిర్మాత అయ్యాడు. శిరీష్, బన్నీ హీరోలుగా రాణిస్తున్నారు. కూతురు లేని అల్లు అరవింద్ అనుపమలో కూతురిని చూసుకున్నాడు అనుకోవచ్చు. కాగా అనుపమ నటించిన మరో చిత్రం బటర్ ఫ్లై విడుదలకు సిద్ధం అవుతుంది. అనుపమ ప్రధాన పాత్రలో బటర్ ఫ్లై మూవీ తెరకెక్కింది. డిసెంబర్ 29న నేరుగా హాట్ స్టార్ లో విడుదల కానుంది. తెలుగుతో పాటు కన్నడ, మలయాళ, తమిళ్ భాషల్లో విడుదల చేస్తున్నారు.