Pushpa Re-Release: అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘పుష్ప’. ఈ మూవీ దెబ్బకు ఏకంగా ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు బన్నీ. సుకుమార్ స్టార్ డైరెక్టర్ అయ్యాడు. ‘పుష్ప 1’ రిలీజై ఏడాది కావస్తోంది. ఇప్పటికీ పార్ట్ 2 షూటింగ్ ప్రారంభం కాలేదు. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పుష్ప మూవీ తెలుగులోనే కాకుండా నార్త్ తో పాటు అమెరికాలో మంచి వసూళ్లను రాబట్టింది. ఏకంగా 360 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది. ఒక్క కేరళలోనే 18 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

పుష్ప 1 పై వచ్చిన హైప్ తో పార్ట్ 2 మరింత క్రేజీగా తీసేందుకు యూనిట్ చాలా టైం తీసుకుంటున్నట్టు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే మంచి లోకేషన్స్ కోసం నార్త్ లోకి వెళ్లి పరిశీలించింది. బ్యాంకాక్ కూడా సినీ ముఖ్యులు వెళ్లి పరిశీలించారట. దీంతో పుష్ప 2ను అక్కడే ప్రారంభిస్తారని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. పుష్ప 2 హైదరాబాద్ లో ప్రారంభించారు. అక్కడా.. ఇక్కడా.. కాకుండా రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేక సెట్ వేశారు. తాజాగా స్ట్రాట్ చేసిన షూటింగ్ లో అల్లు అర్జున్ లేడు. మిగతా సీన్స్ తీశారు. డిసెంబర్ నుంచి బన్నీ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటారు.

ఇక పుష్ప2కు హైప్ తెచ్చేందుకు ఇప్పటి నుంచే టీం కసరత్తులు చేస్తోంది. ముందుగా బన్నీకి బాగా హైప్ ఉన్న మలయాళ సినీ ఇండస్ట్రీ నుంచే ఈ పని మొదలుపెట్టింది. తెలుగులో ఎంత మార్కెట్ ఉందో అల్లు అర్జున్ కు కేరళలలోనూ అంతే క్రేజ్ ఉంది. అందుకే డిసెంబర్ 17తో పుష్ప విడుదలై ఏడాది పూర్తి కావస్తున్న సందర్భంగా ఈ సినిమా రెండో భాగానికి ఊపు తెచ్చే నిర్ణయం తీసుకుంది.
పుష్ప 1 మూవీని కేరళలలో రీ రిలీజ్ చేసేందుకు అక్కడి బన్నీ ఫ్యాన్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కువ స్క్రీన్లు అందుబాటులో ఉండేలా చూసుకుంటున్నారు. సినిమాలేవీ లేని సమయంలో రిలీజ్ చేసి మరికొన్ని కలెక్షన్లు సాధించడంతోపాటూ పుష్ప2 కు క్రేజ్ తెచ్చేందుకు బన్నీ ఫ్యాన్స్, పుష్ప టీం కసరత్తులు చేస్తోంది.