https://oktelugu.com/

Allu Arjun – Jr NTR : ‘పార్టీ లేదా పుష్పా’ అంటూ అల్లు అర్జున్ ని ఆటపట్టించిన ఎన్టీఆర్..వైరల్ ట్విట్టర్ చాట్

allu arjun ntr tweet chat viral : నేడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ట్విట్టర్ లో ఉన్న సెలబ్రిటీస్ అందరూ అల్లు అర్జున్ కి విష్ చేసారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మరియు అల్లు అర్జున్ మధ్య జరిగిన ఒక చిలిపి సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియా ని షేక్ చేస్తుంది.ముందుగా ఎన్టీఆర్ అల్లు అర్జున్ కి విష్ చేస్తూ ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు బావ’ అంటూ ట్వీట్ చేస్తాడు. […]

Written By:
  • NARESH
  • , Updated On : April 8, 2023 / 10:29 PM IST
    Follow us on

    allu arjun ntr tweet chat viral : నేడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ట్విట్టర్ లో ఉన్న సెలబ్రిటీస్ అందరూ అల్లు అర్జున్ కి విష్ చేసారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మరియు అల్లు అర్జున్ మధ్య జరిగిన ఒక చిలిపి సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియా ని షేక్ చేస్తుంది.ముందుగా ఎన్టీఆర్ అల్లు అర్జున్ కి విష్ చేస్తూ ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు బావ’ అంటూ ట్వీట్ చేస్తాడు.

    దానికి అల్లు అర్జున్ వెంటనే రిప్లై ఇస్తూ ‘థాంక్యూ వెరీ మచ్ భావ..లాట్స్ ఆఫ్ హగ్స్’ అంటూ రిప్లై ఇస్తాడు.అప్పుడు ఎన్టీఆర్ వెంటనే రిప్లై ఇస్తూ ‘ఓన్లీ హగ్స్ యేనా..పార్టీ లేదా పుష్పా’ అంటూ మళ్ళీ రిప్లై ఇస్తాడు.ఇక కాసేపటి తర్వాత అల్లు అర్జున్ ఎన్టీఆర్ డైలాగ్ తో రిప్లై ఇస్తూ ‘వస్తున్నా’ అంటాడు.ఈ క్యూట్ చాట్ ని చూసిన తర్వాత అభిమానులందరూ ఎంతో మురిసిపోయారు.

    జూనియర్ ఎన్టీఆర్ ఇది వరకు ఎంతో మంది సెలబ్రిటీస్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసాడు కానీ, ఇంత ఫన్నీ చాట్ మాత్రం ఇదివరకు ఎప్పుడూ చెయ్యలేదు.మొట్టమొదటిసారి ఆయన అల్లు అర్జున్ తో ఈ చిట్ చాట్ చేసాడు.ఇదంతా చూసిన తర్వాత అభిమానులు ఇద్దరు పక్కపక్కనే కూర్చొని మందుకొడుతున్నారు కదా అంటూ ఫన్నీ కామెంట్స్ చేసారు.

    ఈ చాట్ మొత్తం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.రాబొయ్యే రోజుల్లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో మల్టీస్టార్ర్ర్ రాబోతోందా, అందుకే ఇలా ఎన్నడూ లేని విధంగా ట్విట్టర్ లో చాట్ చేసుకున్నారా అనే సందేహాలు మొదలయ్యాయి.ఒకవేళ ఈ కాంబినేషన్ లో సినిమా వస్తే మాత్రం బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ కి హద్దులే ఉండవు అని చెప్పొచ్చు, చూడాలి మరి.