
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. వైజాగ్ షెడ్యూల్ కంప్లీట్ కాగా హైదరాబాద్ లో లేటెస్ట్ షెడ్యూల్ జరుగుతుంది. ఇప్పటికే షూటింగ్ ఆలస్యం కాగా దర్శకుడు సుకుమార్ త్వరితగతిన పూర్తి చేయనున్నారని సమాచారం. పుష్ప 2 అనంతరం అల్లు అర్జున్ ఏ దర్శకుడితో మూవీ చేస్తాడనే విషయంలో అనేక వాదనలు వినిపించాయి. సడన్ గా ఆయన సందీప్ రెడ్డి వంగాకు ఛాన్స్ ఇచ్చాడు. ఈ మేరకు అధికారిక ప్రకటన జరిగింది. బాలీవుడ్ నిర్మాణ సంస్థ టి సిరీస్ ఈ ప్రాజెక్టు నిర్మించనుంది. కేవలం హీరో, నిర్మాత, దర్శకుడు వివరాలు మాత్రమే ఇచ్చారు.
ఇక ప్రాజెక్ట్ 2025 పట్టాలెక్కనున్నట్లు పరిశ్రమ వర్గాల బోగట్టా. అయితే మూవీ లాక్ చేశారు కానీ… కథ కూడా లేదనేది లేటెస్ట్ టాక్. సందీప్ రెడ్డి వంగా భూషణ్ కుమార్ కి కబీర్ సింగ్ చిత్రంతో భారీ హిట్ ఇచ్చారు. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన కబీర్ సింగ్ దాదాపు నాలుగు వందల కోట్లు వసూలు చేసింది. అర్జున్ రెడ్డి రీమేక్ గా కబీర్ సింగ్ తెరకెక్కింది. దీంతో ఆయన సందీప్ రెడ్డి వంగాకు వరుస ఆఫర్స్ ఇస్తున్నారు.
ప్రస్తుతం రన్బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి తెరకెక్కిస్తున్న యానిమల్ నిర్మాత కూడా భూషణ్ కుమారే. అలాగే ప్రభాస్ తో ప్రకటించిన స్పిరిట్ కూడా టి సిరీస్ సంస్థలోనే. యానిమల్ సెట్స్ పై ఉండగానే మరో సినిమా సందీప్ రెడ్డితో చేసేందుకు అదే నిర్మాతలు ముందుకు వచ్చారు. కాగా అల్లు అర్జున్ కి సందీప్ రెడ్డి ఎలాంటి కథ వినిపించలేదట. కనీసం లైన్ కూడా చెప్పలేదట. కేవలం కాంబినేషన్ ప్రకటించారంతే. అల్లు అర్జున్ తో ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అనేది యానిమల్, స్పిరిట్ చిత్రాల సక్సెస్ పై ఆధారపడి ఉంటుంది.

ఆ రెండు చిత్రాల్లో ఒకటి విజయం సాధించినా అల్లు అర్జున్ సందీప్ రెడ్డితో మూవీ చేస్తారు. లేదంటే నిర్దాక్షిణ్యంగా క్యాన్సిల్ చేస్తారు. ఆ విషయంలో అల్లు అర్జున్ కి మొహమాటమే ఉండదు. గతంలో వేణు శ్రీరామ్, కొరటాల శివతో పాటు ఒకరిద్దరు డైరెక్టర్స్ తో అధికారిక ప్రకటన చేసి, తర్వాత ఆ ప్రాజెక్ట్స్ ని వదిలేశారు. కాబట్టి వంద శాతం సందీప్ రెడ్డి వంగాతో అల్లు అర్జున్ మూవీ ఉంటుందని చెప్పలేం. కాగా త్రివిక్రమ్ తో నెక్స్ట్ మూవీ చేసేందుకు ఫిక్స్ అయిన అల్లు అర్జున్… త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నారట.