Homeఎంటర్టైన్మెంట్Allu Arjun Pushpa: బన్నీకి చిత్తూరు యాస నేర్పిన ఈ చిన్నోడి కథ మీకు తెలుసా?

Allu Arjun Pushpa: బన్నీకి చిత్తూరు యాస నేర్పిన ఈ చిన్నోడి కథ మీకు తెలుసా?

Allu Arjun Pushpa: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్- బన్నీ కాంబోలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ ఇటీవల విడుదలై సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రధానంగా తెలుగులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడిని చిత్తూరు యాస ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నదని చెప్పొచ్చు. కాగా, బన్నీకి ఆ యాస నేర్పిన వ్యక్తుల్లో ఒకరు చరణ్. మోహన్, జశ్వంత్‌తో పాటు నాయుడు పేట మండలం పూడేరుకు చెందిన చిన్నోడు చరణ్.. బన్నీకి చిత్తూరు యాస నేర్పించాడు. ఆ యువకుడి రియల్ లైఫ్ స్టోరి తెలుసుకుందాం.

Allu Arjun Pushpa
Allu Arjun Pushpa

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ‘పుష్ప’ పిక్చర్‌ తెరకెక్కిన సంగతి అందరికీ విదితమే. ఇకపోతే ఈ ఫిల్మ్ చిత్రీకరణ ఎక్కువ భాగం ఏపీలోని ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ మారేడుమిల్లి ఫారెస్ట్‌లో జరిగింది. ఈ క్రమంలోనే సినిమాలోని సంభాషణలు అన్నీ కూడా చిత్తూరు యాసలో సాగేలా ప్రయారిటీ ఇచ్చారు డైరెక్టర్ సుకుమార్. ఈ క్రమంలోనే సినిమా నటీనటులందరికీ చిత్తూరు యాస నేర్పించారు. అలా బన్నీ బాడీ లాంగ్వేజ్, లాంగ్వేజ్ పైన స్పెషల్ ఫోకస్ పెట్టారు.

నాయుడు పేట మండలం పూడేరుకు చెందిన కురుగొండ గంగాధరం, వాణి దంపతుల కుమారుడు చరణ్. చరణ్ తండ్రి కూలి కాగా, తల్లి పాఠశాలలో మధ్యాహ్న భోజనం నిర్వాహకురాలు. చరణ్ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో మెకానికల్ ఇంజినీరింగ్ చేశాడు. పెద్దమ్మ కుటుంబం చిత్తూరులో ఉండటంతో అక్కడే ఉండి చిత్తూరు జిల్లాల యాసపై పట్టు సాధించాడు. ఆ పట్టు చరణ్ జీవితాన్ని మలుపు తిప్పింది.

Also Read: పుష్పలో ఆ సీన్​ను సుకుమార్​ నగ్నంగా చూపించాలనుకున్నాడట!

షార్ట్ ఫిల్మ్స్ , నటనపై ఆసక్తి ఉన్న చరణ్ కొద్ది రోజుల పాటు ప్రైవేటు సంస్థలో పని చేశాడు. అనంతరం సినిమాల్లో నటించేందుకు ట్రై చేశాడు. అలా లాక్ డౌన్ టైంలో ‘పుష్ప’ చిత్రంలో నటనకు ఎంపికయ్యాడు. ఈ క్రమంలోనే చరణ్ యాసకు ఫిదా అయిన సుకుమార్.. సినిమా మొత్తం అదే యాసను పెట్టేశాడు. ఇకపోతే తను బన్నీతో కలిసి నటించడంతో పాటు ఆయనకు భాష, యాసను నేర్పించడం అదృష్టంగా భావించానని చరణ్ చెప్పుకొచ్చాడు.

తను నటించిన మూడు చిత్రాల్లు త్వరలో విడుదలవుతున్నాయని చరణ్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ‘పుష్ప’ చిత్రంలో నటిస్తున్నపుడే తనకు మ్యారేజ్ అయిందని, ‘పుష్ప’ వలన తనకు లైఫ్, వైఫ్ రెండు వచ్చాయని చరణ్ తెలిపాడు. మొత్తంగా చరణ్ లైఫ్ ఒకే ఒక సినిమాతో సెట్ అయిపోయింది. ‘పుష్ప’ సెకండ్ పార్ట్ షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి స్టార్ట్ కాబోతున్నది. ఇందులో బన్నీ సరసన హీరోయిన్‌గా రష్మిక మందన నటించగా, మెయిన్ విలన్‌గా మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ నటించారు.

Also Read: ‘పుష్ప’ 13 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ !

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
RELATED ARTICLES

Most Popular