Allu Arjun Birthday: కేవలం సినీ బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ తో ఇండస్ట్రీ లోకి వస్తే సరిపోదు, టాలెంట్ ఉండాలి, కష్టపడే తత్త్వం ఉండాలి, పైకి ఎదగాలి అనే కసి కచ్చితంగా ఉండాలి. ఇవన్నీ ఉన్న హీరోనే అల్లు అర్జున్(Icon Star Allu Arjun). ఆయన తండ్రి టాలీవుడ్ లో ఒక ప్రముఖ నిర్మాత, మామయ్యలు ఇద్దరూ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్, తానూ ఏది చేసిన చెల్లిపోతుంది అనుకోని ఉండుంటే కేవలం రెండు మూడు సినిమాలతోనే కెరీర్ ముగిసిపోయేది. కానీ అల్లు అర్జున్ తన బ్యాక్ గ్రౌండ్ ఇమేజి ని నమ్ముకోకుండా, కేవలం తన టాలెంట్, కష్టాన్ని నమ్ముకున్నాడు, నేడు ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని శాసించే స్థాయికి ఎదిగాడు. ఇతను తొలిసారి వెండితెర పై కనిపించిన చిత్రం ‘డాడీ’. అల్లు అరవింద్(Allu Aravind) నిర్మాతగా, చిరంజీవి(Megastar Chiranjeevi) హీరోగా నటించిన ఈ సినిమాలో అల్లు అర్జున్ రెండు సన్నివేశాల్లో కనిపిస్తాడు.
Also Read: అల్లు అర్జున్,విజయ్ కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా అదేనా? డైరెక్టర్ ఎవరంటే!
ఒక సన్నివేశం లో అల్లు అర్జున్ అద్భుతమైన డ్యాన్స్ చేయడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవి మేనల్లుడు ‘డాడీ’ చిత్రం లో డ్యాన్స్ అదరగొట్టాడు అనే టాక్ అప్పట్లో చాలా వైరల్ అయ్యిందట. కేవలం అల్లు అర్జున్ డ్యాన్స్ ని చూడడం కోసమే అప్పట్లో థియేటర్స్ కి క్యూలు కట్టిన వారు ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో. కేవలం చిరంజీవి మేనల్లుడు అవ్వడం వల్ల అల్లు అర్జున్ కి ఆ చిన్న సన్నివేశంతో అంతటి పేరు రాలేదు, అతని టాలెంట్ కారణంగానే వచ్చింది. అలా ‘డాడీ’ చిత్రంతో తెలుగు ఆడియన్స్ కి పరిచయమైనా అల్లు అర్జున్, హీరో గా ‘గంగోత్రి’ చిత్రం తో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది కానీ, అల్లు అర్జున్ స్క్రీన్ ప్రెజెన్స్ పై అప్పట్లో ట్రోల్స్ వేరే లెవెల్ లో వచ్చాయి. ఇతను హీరో ఏంట్రా బాబు, ఖర్మ అని చాలా మంది కామెంట్స్ కూడా చేసేవారు.
ఎవరైతే ఆయనపై అలాంటి కామెంట్స్ చేశారో, వాళ్ళ చేతనే రెండవ సినిమా నుండి శభాష్ అనిపించుకోవడం మొదలు పెట్టాడు. అలా మొదలైన అల్లు అర్జున్ సినీ ప్రస్థానం, ఒక్కో మెట్టు ఎదుగుతూ, నేడు ఎవ్వరూ చేరుకోలేని స్థానానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇతర ఇండస్ట్రీస్ లో రాజమౌళి కంటే అల్లు అర్జున్ బ్రాండ్ పెద్దది అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ‘పుష్ప’ సిరీస్ తో ఆయన సృష్టించిన సునామీకి బాలీవుడ్ ఖాన్స్ అడ్రస్లు సైతం గల్లంతు అయ్యాయి. సౌత్ లోనే కాదు, ఇప్పుడు ఇండియా వైడ్ గా అల్లు అర్జున్ ని నెంబర్ 1 హీరో అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రాబోయే రోజుల్లో అల్లు అర్జున్ అనే బ్రాండ్ మన టాలీవుడ్ ని ఇంకెంత స్థాయికి తీసుకెళ్తుందో, ఆయనకు ఎన్ని నేషనల్ అవార్డ్స్, ఆస్కార్ అవార్డ్స్ ని తెచ్చిపెడుతుందో చూడాలి.
Also Read: హృతిక్ రోషన్ తో చిరంజీవి డైరెక్టర్..ఊహించని కాంబినేషన్ కి ముహూర్తం ఫిక్స్!