KCR : ఎట్టకేలకు ఢిల్లీ ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ 27ఏళ్ల తర్వాత ఢిల్లీ గడ్డ మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన వెంటనే, దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీల మధ్య చర్చలు, విమర్శలు, అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీలో బీజేపీ విజయంతో కాంగ్రెస్ నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ (BRS) నేత కేటీఆర్ చేసిన ట్వీట్‌లో రాహుల్ గాంధీని అభినందిస్తూ చేసిన సెటైర్ ట్వీట్ పై కాంగ్రెస్ నేతలు విమర్శలు కురిపించారు.
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత తెలంగాణలోని BRS (తెలంగాణ రాష్ట్ర సమితి) నేతలు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు కురిపించారు. బీజేపీ విజయానికి రాహుల్ గాంధీ తోడ్పడ్డాడంటూ వ్యంగ్యస్త్రాలను సంధించారు. ఈ క్రమంలో కేటీఆర్ చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతుంది. KTR చేసిన సెటైరికల్ ట్వీట్లో “రాహుల్ గాంధీకి అభినందనలు. ఢిల్లీలో బీజేపీకి గెలవడానికి రాహుల్ సాయం చేశారంటూ రాసుకొచ్చారు. బీజేపీ విజయంతో పరోక్షంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు పడ్డట్లు అయింది. ఈ ట్వీట్ కేసీఆర్, కేటీఆర్ ప్రధానంగా ఢిల్లీ రాజకీయాల్లో తమ పాత్రను ఉద్ఘాటించే ప్రయత్నంగా కనిపిస్తోంది.
పత్తా లేకుండా పోయిన కాంగ్రెస్
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మరొకసారి నిరాశ ఎదురైంది. గతంలో అంచనాలు, ఎన్నికల ప్రచారం బలంగా ఉన్నప్పటి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఖాతా కూడా తెరవలేకపోయింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ పై చేసిన కామెంట్లకు ఆ పార్టీ నేతలు కూడా గట్టిగానే కౌంటర్లు వేస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్‌కి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. “కేసీఆర్ ని కలిసిన వారంతా ఓడిపోతారు” అని కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
రాహుల్ గాంధీ, ఇతర నేతలపై సెటైర్:
కేసీఆర్, కేటీఆర్ వంటి తెలంగాణ నేతలు.. ఢిల్లీతో సహా, ఇతర ప్రాంతీయ పార్టీలతో సన్నిహితంగా ఉంటున్నారు. ముఖ్యంగా అరవింద్ కేజ్రివాల్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, నవీన్ పట్నాయక్, థాక్రే వంటి నాయకులతో తమ తమ రాజకీయ సంబంధాలను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే అరవింద్ కేజ్రివాల్ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ను కలవడం వల్లే ఓడిపోయారని కాంగ్రెస్ నేతలు ట్వీట్స్ చేస్తున్నారు. ‘మనం చెయ్యి కలిపితే మామూలుగా లేదుగా. వైఎస్ జగన్, నవీన్ పట్నాయక్, థాక్రే, కేజీవాల్’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. కాగా ఢిల్లీలో కాంగ్రెస్ మరోసారి సున్నా సీట్లు గెలిచిందని బీఆర్ఎస్ శ్రేణులూ రీకౌంటరిస్తున్నాయి