https://oktelugu.com/

Game Changer Movie :  అమెజాన్ ప్రైమ్’ లో ట్రెండింగ్ లిస్ట్ లో చోటు దక్కించుకోలేకపోయిన ‘గేమ్ చేంజర్’..ఓటీటీ లో కూడా డిజాస్టర్ రెస్పాన్స్?

థియేటర్స్ లో రెస్పాన్స్ ఎలాగో రాలేదు. కనీసం ఓటీటీ లో అయినా రెస్పాన్స్ వస్తుందా అనుకుంటే అక్కడ కూడా రెస్పాన్స్ నీరసంగానే ఉందని విశ్లేషకులు అంటున్నారు. విడుదలై 24 గంటలు పూర్తి అయినా ఇప్పటికీ ఈ చిత్రం టాప్ 10 ట్రెండింగ్ లిస్ట్ లోకి రాలేదు.

Written By:
  • Vicky
  • , Updated On : February 8, 2025 / 07:11 PM IST
    Game Changer Movie

    Game Changer Movie

    Follow us on

    Game Changer :  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం ఈ సంక్రాంతికి భారీ అంచనాల నడుమ విడుదలై బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. అభిమానుల అంచనాలను ఈ చిత్రం ఏమాత్రం అందుకోలేకపోయింది. కానీ రామ్ చరణ్ స్టామినా కారణంగా, డిజాస్టర్ ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. థియేట్రికల్ షేర్ కూడా వంద కోట్ల రూపాయలకు పైగా రాబట్టింది. కానీ ఈ సినిమా బయ్యర్లకు మిగిల్చిన నష్టాలు కూడా వంద కోట్ల రూపాయలకు పైనే ఉంటుంది. దిల్ రాజు సమయస్ఫూర్తిని ఉపయోగించి ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాన్ని విడుదల చేయడం వల్ల ‘గేమ్ చేంజర్’ నష్టాలు పూడాయి. లేకపోతే అందరూ దారుణంగా దెబ్బ తినేవారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా నిన్నటి నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవ్వడం మొదలు పెట్టింది.

    థియేటర్స్ లో రెస్పాన్స్ ఎలాగో రాలేదు. కనీసం ఓటీటీ లో అయినా రెస్పాన్స్ వస్తుందా అనుకుంటే అక్కడ కూడా రెస్పాన్స్ నీరసంగానే ఉందని విశ్లేషకులు అంటున్నారు. విడుదలై 24 గంటలు పూర్తి అయినా ఇప్పటికీ ఈ చిత్రం టాప్ 10 ట్రెండింగ్ లిస్ట్ లోకి రాలేదు. ఏ సినిమాకి అయినా 48 గంటల సమయం పడుతుంది కానీ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం కేవలం 24 గంటల లోపే ట్రెండ్ లిస్ట్ లోకి వచ్చింది. సోషల్ మీడియా లో ఇరువురి హీరోల అభిమానులు పరస్పరం ఇలా పోల్చుకుంటూ చూసుకుంటారు కాబట్టి, మీ సినిమా కంటే మా సినిమానే ముందుగా ట్రెండింగ్ లోకి వచ్చిందంటూ ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఓటీటీ విడుదల తర్వాత అప్పన్న క్యారక్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. సోషల్ మీడియా లో అనేక మంది ఈ ఎపిసోడ్ కి సంబంధించిన కొన్ని సీన్స్ ని అప్లోడ్ చేస్తూ రామ్ చరణ్ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

    మరి లాంగ్ రన్ లో ఈ చిత్రం ఓటీటీ ఆడియన్స్ ని ఎంత వరకు అలరిస్తుందో చూడాలి. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ బుచ్చి బాబు తో రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తన కెరీర్ లో ది బెస్ట్ గా నిల్చిన ‘రంగస్థలం’ కంటే బెటర్ గా ఉంటుందని, నా కోసం డైరెక్టర్ మరో అద్భుతమైన క్యారక్టర్ ని డిజైన్ చేసాడని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టుకొని శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి, అక్టోబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. AR రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.