https://oktelugu.com/

Alia Bhatt: ఇన్ స్టాగ్రామ్ లో అత్యంత ప్రభావితం చేసే ప్రముఖుల్లో భారత్ నుంచి ఒక్క ఆలియాభట్ కే చోటు

Alia Bhatt: సోషల్ మీడియా దిగ్గజం ఇన్ స్టాగ్రామ్ కు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పిచ్చ క్రేజ్ ఉంది. దీన్ని వాడని సెలబ్రెటీలు లేరంటే అతిశయోక్తి కాదు. అంతలా ఊపేసే ఇన్ స్టాగ్రామ్ లో ప్రపంచవ్యాప్తంగా ప్రభావితం చేసే టాప్ 10 లిస్ట్ ను తాజాగా విడుదల చేసింది. ఆశ్చర్యకరంగా ఇందులో ఒకే ఒక్క భారతీయురాలు చోటు సంపాదించింది. ఆమె ఎవరో కాదు ప్రముఖ బాలీవుడ్ నటి ‘ఆలియాభట్’. అగ్రహీరోయిన్ గా బాలీవుడ్‌ ను శాసిస్తున్న ఆలియా భట్ తన […]

Written By:
  • NARESH
  • , Updated On : April 27, 2022 / 04:37 PM IST
    Follow us on

    Alia Bhatt: సోషల్ మీడియా దిగ్గజం ఇన్ స్టాగ్రామ్ కు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పిచ్చ క్రేజ్ ఉంది. దీన్ని వాడని సెలబ్రెటీలు లేరంటే అతిశయోక్తి కాదు. అంతలా ఊపేసే ఇన్ స్టాగ్రామ్ లో ప్రపంచవ్యాప్తంగా ప్రభావితం చేసే టాప్ 10 లిస్ట్ ను తాజాగా విడుదల చేసింది. ఆశ్చర్యకరంగా ఇందులో ఒకే ఒక్క భారతీయురాలు చోటు సంపాదించింది. ఆమె ఎవరో కాదు ప్రముఖ బాలీవుడ్ నటి ‘ఆలియాభట్’.

    అగ్రహీరోయిన్ గా బాలీవుడ్‌ ను శాసిస్తున్న ఆలియా భట్ తన నటనా నైపుణ్యంతో ఇప్పుడు పాశ్చాత్య దేశాలను కూడా ఆకట్టుకుంటోంది. అయితే హాలీవుడ్‌లో అడుగు పెట్టకముందే అలియా భట్ ప్రపంచవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించగలిగింది. ఇన్ స్టాగ్రామ్ లో ప్రభావితం చేసే కొత్త సెలబ్రిటీ జాబితాలో ఏకంగా చోటు సంపాదించుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ హబ్ నివేదిక ప్రకారం.. రాజీ స్టార్ జెండయా మరియు విల్ స్మిత్ వంటి వారు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రభావితం చేసే టాప్ 10 సెలబ్రిటీలలో ఉన్నారు. బుధవారం ఉదయం 10 గంటల వరకూ ఈ జాబితాలో జెండయా అగ్రస్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో ఆలియా భట్ ఆరో స్థానంలో నిలిచింది. రెండవ స్థానంలో ‘స్పైడర్ మ్యాన్ నోవే’ సహనటుడు మరియు రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ టామ్ హాలండ్, తర్వాత డ్వేన్ ‘ది రాక్’ జాన్సన్, దక్షిణ కొరియా రాపర్ హోప్ మరియు విల్ స్మిత్ లు వరుసగా ఉన్నారు.

    Alia Bhatt

    నివేదిక ప్రకారం, అలియా భట్‌కు 64 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. 3.57 శాతం ఎంగేజ్‌మెంట్ రేటు కలిగి ఉంది. దీంతో అలియా భట్ వరుసగా ఏడు, తొమ్మిది, పదో స్థానాల్లో ఉన్న జెన్నిఫర్ లోపెజ్, క్రిస్ట్ హెమ్స్‌వర్త్, రాబర్ట్ డౌనీ జూనియర్‌లను వెనక్కి నెట్టింది. అలాగే భారతీయ నటులు ప్రియాంక చోప్రా, అక్షయ్ కుమార్, శ్రద్ధ కపూర్, రష్మిక మందన వరుసగా 13, 14, 18, 19 స్థానాల్లో ఉండడం విశేషం.

    Also Read: TRS Plenary: కేసీఆర్‌ సేఫ్‌ గేమ్‌… ప్రత్యర్థుల పేరెత్తని గులాబీ అధినేత

    అలియా భట్ ఇన్‌స్టాగ్రామ్ లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. నటి టైమ్‌లైన్ ప్రొఫెషనల్ గా కనిపిస్తుంది. వ్యక్తిగత అప్‌డేట్‌లు.. ఆరోగ్యకరమైన టిప్స్ కూడా అందజేస్తుంది. తన చలనచిత్రాలు, బ్రాండ్‌లు మరియు వ్యవస్థాపక ప్రయత్నాల కోసం ప్లాట్‌ఫారమ్‌ను మార్కెటింగ్ సాధనంగా కూడా ఉపయోగిస్తుంది. కోవిడ్ 19 మహమ్మారి సమయంలో హెల్ప్‌లైన్‌లు.. ప్రజా సేవలకు సంబంధించిన వివరాలను అందించడానికి కూడా ఆమె ఈ పేజీని ఉపయోగించుకుంది.

    Also Read: Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట సినిమా కూడా లీక్ అవ్వబోతుందా??.. ఆందోళనలో మేకర్స్

    ఇక అలియా భట్ సినిమాల విషయానికి వస్తే.. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించి ఇటీవల విడుదలైన ‘గంగూబాయి కతియావాడి’కి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆమె తదుపరి చిత్రం తన భర్త రణబీర్ కపూర్‌తో బ్రహ్మాస్త్రా లో నటించింది. నెట్‌ఫ్లిక్స్ స్పై థ్రిల్లర్ హార్ట్ ఆఫ్ స్టోన్ కోసం హాలీవుడ్ నటులు గాల్ గడోట్ మరియు జామీ డోర్నన్‌లతో కూడా ఆమె కనిపించనుంది.

    Recommended Videos: