Alekhya Chitti Pickles: చిరు వ్యాపారులకు సోషల్ మీడియా మంచి పబ్లిసిటీ ప్లాట్‌పాం(Publicity Platform)గా మారింది. పెద్ద పెద్ద కంపెనీలు వీడియోల మధ్య యాడ్స్ ఇస్తుండగా, చిరు వ్యాపారులు మాత్రం సెల్ఫ్‌గా, ఫ్రీగా పబ్లిసిటీ చేసుకుంటున్నారు. ఈ ట్రెండ్ క్రమంగా పెరుగుతోంది. దీంతో బిజెనెస్(Business) కూడా బాగా జరుగుతోంది. తాజాగా అలేఖ్య చిట్టి పికిల్స్ పేరు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా వినిపిస్తోంది. నాన్‌వెజ్ పచ్చళ్లకు ప్రసిద్ధి చెందిన ఈ వ్యాపారం రాజమండ్రి కేంద్రంగా చిట్టి, అలేఖ్య, రమ్య అనే ముగ్గురు అక్కాచెల్లెళ్లు నడిపారు. తెలుగు రాష్ట్రాల(Telugu States)తో పాటు ఇతర ప్రాంతాలు, విదేశాల నుంచి కూడా వీరి పచ్చళ్లకు డిమాండ్ ఉండేది. వాట్సాప్ ద్వారా ఆర్డర్లు స్వీకరిస్తూ, రుచిలోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే, ఈ బ్రాండ్ ఒక్కసారిగా ఆన్‌లైన్ స్టోర్‌ను మూసివేయాల్సిన స్థితికి చేరుకుంది.
Also Read: ఎన్టీఆర్ సన్నబడటం పై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్న అభిమానులు…
తక్కుకాలంలోనే ఫేమస్..
ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్లు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లుగా కూడా గుర్తింపు పొందారు. గతంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ‘‘మీ రొయ్యల పచ్చడి తిని నా భార్యకు కడుపు వచ్చింది’’ అనే ఫన్నీ కామెంట్‌తో ఈ బ్రాండ్ బాగా పాపులర్ అయింది. ఈ సంఘటన చాలా మందిని పచ్చళ్ల రుచి తెలుసుకోవడానికి ఆర్డర్‌లు ఇవ్వడానికి ప్రేరేపించింది. అయితే, ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. అరకిలో నాన్‌వెజ్ పచ్చళ్ల ధర రూ.530 నుంచి రూ.1660 వరకు ఉండేది.
ఇటీవల సమస్య..
సమస్య ఇటీవల ఓ కస్టమర్ నుంచి మొదలైంది. అతను వాట్సాప్‌లో ‘‘హాయ్’’ అని మెసేజ్ చేయగా, పచ్చళ్ల రేట్లు వచ్చాయి. ‘‘ఇంత ధర ఎందుకు?’’ అని ప్రశ్నించిన అతనికి, అలేఖ్య చిట్టి పికిల్స్ నుంచి బూతులతో కూడిన వాయిస్ మెసేజ్ వచ్చింది. ‘నీ భార్యకు, లవర్‌కు బంగారం ఏం కొనిపెడతావ్? కెరియర్ మీద ఫోకస్ పెట్టు‘
‘‘రూ.3 వేలు పెట్టి పచ్చడి కొనలేనోడివి, నీ పెళ్లాంకి ఏం కొనిస్తావ్? డబ్బు సంపాదించుకోవడం నేర్చుకో’’ అంటూ దూషణలు తెగిపోయాయి. ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేశారు. మరో ఆడియోలో ఓ మహిళా కస్టమర్‌ను ‘‘పిచ్చి మొఖం దానా, నీ దరిద్రం ఏ రేంజ్‌లో ఉందో తెలుసు’’ అంటూ తిట్టినట్లు వైరల్ అయింది.
మరో వీడియో కూడా..
ఇదిలా ఉండగా, మరో కస్టమర్‌తో కూడా ధరల విషయంలో అసభ్యంగా మాట్లాడిన మరో వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ‘ఊరగాయల ధరలు ఇంతనా అంటావ్? నువ్వు ప్రతి ఇంటికి వెళ్లి పని చేసి బతుకు‘ అంటూ బూతులు తిట్టిన ఆ ఆడియో మళ్లీ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, ‘వీళ్ల దగ్గర పచ్చళ్లు కొనొద్దు‘ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.
విమర్శలు..
ఈ వివాదంతో అలేఖ్య చిట్టి పికిల్స్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. వాట్సాప్ ఖాతాను డిలీట్ చేసి, ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందనలు ఆపేసి, వెబ్‌సైట్‌ను కూడా మూసివేశారు. కస్టమర్లను గౌరవించకపోతే వ్యాపారం ఇలాగే మూతపడుతుందని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. మంచి పేరుతో సాగిన ఈ వ్యాపారం ఒక్క ఆడియోతో తలకిందులైంది.
చివరకు క్షమాపణ..
ఈ వివాదంపై అలేఖ్య సిస్టర్స్‌లో ఇద్దరు స్పందించారు. రమ్య అనే అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో రిలీజ్ చేసి, కస్టమర్లకు క్షమాపణ చెప్పినట్లు తెలిపింది. అయితే, వారి వ్యాఖ్యలు విషయాన్ని దారి మళ్లించే ప్రయత్నంలా కనిపిస్తున్నాయి. గతంలో నెగిటివ్ కామెంట్లకు ఘాటుగా స్పందించినప్పుడు వారిని సమర్థించిన నెటిజన్లు, ఇప్పుడు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ ఘటన సోషల్ మీడియా శక్తిని, అదే సమయంలో దాని వల్ల కలిగే నష్టాన్ని స్పష్టంగా చూపిస్తోంది.
Okkokati bayataki vastunnayi
Now the victim is a lady customer pic.twitter.com/0GTHrrPdUp— Satya ™️ (@MSD_Prabhasatya) April 3, 2025