NTR : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ కి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది నందమూరి ఫ్యామిలీ నుంచి ఆయన భారీ సక్సెస్ లను సాధిస్తూ తన నటనతో ప్రతి ఒక్క ప్రేక్షకుడిని తన అభిమానిగా మార్చుకుంటున్నాడు. ఇలాంటి సందర్భంలోనే ఆయన ఇప్పుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు…ఈ సినిమాతో ఇండస్ట్రీ రికార్డు లు బ్రేక్ చేయాలని చూస్తున్నాడు…
నందమూరి ఫ్యామిలీ హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీ బాధ్యతలు మొత్తాన్ని తనే మోస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం. మరి ఆయన ఏ సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఎంచుకుంటూ ఉంటాడు. తద్వారా ఆయనకు మంచి గుర్తింపు రావడమే కాకుండా తాతకు తగ్గ మనవడిగా మంచి పేరునైతే సంపాదించుకున్నాడు. విశ్వవిఖ్యాత ‘శ్రీ నందమూరి తారక రామారావు’ గారి అంశతో జన్మించిన జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ తాతకు తీసిపోనటువంటి నటనతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఇప్పటివరకు ఆయన వరుసగా ఏడు సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించాడు. ఇక రాబోయే సినిమాలతో కూడా వరుసగా విజయాలను అందుకోవాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు. రీసెంట్ గా ఎన్టీఆర్ బావమరిది అయిన నార్నే నితిన్ హీరోగా వచ్చిన మ్యాడ్ స్క్వేర్ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా మంచి విజయాన్ని దక్కించుకోవడంతో రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ పార్టీని ఏర్పాటు చేశారు. ఆ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా వచ్చాడు.
Also Read : ‘మ్యాడ్ స్క్వేర్’ సక్సెస్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ డైలాగ్ కొట్టిన ఎన్టీఆర్!
మరి అతన్ని చూసిన అభిమానులందరూ ఒక్కసారిగా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఇంతకుముందు చాలా దృఢంగా ఉండేవాడు. ఇప్పుడు మాత్రం చాలా సన్నబడిపోయాడు. దానికి కారణం ఏంటి అంటే ప్రశాంత్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా కోసం ఆయన కొంతవరకు సన్నబడినట్టుగా తెలుస్తోంది.
ఇక ఇది చూసిన చాలామంది అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ ఇంతకుముందు కండలు తిరిగిన బాడితో ఉన్నప్పుడే చాలా అందంగా ఉన్నాడని ఇప్పుడు చాలా సన్నబడిపోవడంతో అసలు ఏమాత్రం హీరో లుక్స్ లేవని అభిప్రాయపడుతుంటే మరి కొంతమంది మాత్రం స్లిమ్ గా మారిన ఎన్టీఆర్ ను చూసి చాలా అందంగా ఉన్నాడు. ఎన్టీఆర్ ఇలా ఉంటేనే బాగుంటాడు అంటూ కామెంట్లైతే చేస్తున్నారు.
మరి జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాలో చాలా స్ట్రాంగ్ బాడీ తో కనిపించాడు. ఇప్పుడు వీక్ గా కనిపించడంతో ప్రశాంత్ నీల్ (Prashanth Neel) సినిమా కోసం ఎందుకు తను సన్నబడ్డాడు. స్క్రిప్ట్ డిమాండ్ చేయడం మేరకే ఆయన అలా చేశాడా? లేదా అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే…
Also Read : మీరు ‘కాలర్’ ఎగరేసుకునేలా చేసే బాధ్యత నాది..’దేవర 2′ ఉంటుంది – జూనియర్ ఎన్టీఆర్