
Akkineni Akhil: అక్కినేని వంశం నుండి వచ్చిన మూడవ తరం హీరోలలో అక్కినేని అఖిల్ కి మంచి క్రేజ్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆయన ఇండస్ట్రీ లోకి వచ్చి 8 ఏళ్ళు అవుతున్నా కూడా ఇప్పటికీ సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేదు. అందుకే ఈసారి కొడితే కుంభస్థలం బద్దలవ్వాలి అనే కసితో ఆయన డైరెక్టర్ సురేందర్ రెడ్డి తో కలిసి ‘ఏజెంట్’ అనే చిత్రం చేసాడు. ఈ సినిమా కోసం అఖిల్ చేసిన హార్డ్ వర్క్ మామూలుది కాదు, కేవలం ఈ చిత్రం కోసమే ఆయన ప్రత్యేకంగా సిక్స్ ప్యాక్ బాడీ పెంచాడు, రిస్కీ ఫైట్స్ ఎన్నో చేసాడు.
రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ కూడా అభిమానులను ఆకట్టుకుంది. సినిమా కూడా అదే రేంజ్ లో అలరిస్తుందో లేదో తెలియాలంటే ఈ నెల 28 వ తారీఖు వరకు వేచి చూడాల్సిందే.కాసేపు సినిమాల సంగతి పక్కన పెడితే అక్కినేని అఖిల్ కి సంబంధించిన ఒక టాప్ సీక్రెట్ నేడు సోషల్ మీడియా లో బయటపడింది.
అదేమిటి అంటే గతం లో ఆయన శ్రీయ భూపాల్ అనే అమ్మాయిని ప్రేమించిన సంగతి తెలిసిందే. ఇంట్లో ఒప్పించి సమంత – నాగ చైతన్య నిశ్చితార్థం జరిగిన రోజే, వీళ్లిద్దరి నిశ్చితార్థం కూడా చేసేసాడు నాగార్జున.అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ, వీళ్లిద్దరి పెళ్లి పెటాకులు అయ్యింది.అప్పటి నుండి అఖిల్ సోలో గానే ఉంటున్నాడు.అయితే వీళ్లిద్దరి మధ్య అలా గొడవలు వచ్చి విడిపోవడానికి కారణం ఏమిటి అనే విషయం ఎవరికీ తెలియదు.కానీ ఈ పెళ్లిని ఆపమని చెప్పింది శ్రీయ భూపాల్ అట.పెళ్లికి కొద్దిరోజుల ముందు ఒక ప్రైవేట్ పార్టీ లో అఖిల్ మరియు శ్రీయ కి మధ్య గొడవలు జరిగిందట.

ఈ గొడవలకు కారణం ఒక ప్రముఖ హీరోయిన్ అని తెలుస్తుంది.అఖిల్ ఆమె తరుపున నిలబడి మాట్లాడడం తో శ్రీయ కి నచ్చలేదట.దాంతో పెద్ద గొడవ పెట్టుకోని విడిపోయారు. అంతే కాదు అఖిల్ టాలీవుడ్ లో పలువురి హీరోయిన్స్ తో బాగా క్లోజ్ గా ఉంటాడు. ఇదంతా శ్రీయ కి నచ్చేది కాదట.అందువల్ల తరచూ గొడవలు కూడా జరిగేవట.అలా వీళ్ళు విడిపోవడానికి ఇదే కారణం అని అంటున్నారు.