
Sonia Singh: సాయి ధరమ్ తేజ్ హీరో గా నటించిన హారర్ థ్రిల్లర్ చిత్రం ‘విరూపాక్ష’ నిన్ననే ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై మంచి పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరో మరియు హీరోయిన్ తర్వాత బాగా హైలైట్ అయ్యింది సోనియా సింగ్. ఈమె విడుదలకు ముందు ప్రొమోషన్స్ లో కూడా యాక్టీవ్ గా పాల్గొన్నది.బుల్లితెర మీద రీసెంట్ గానే ప్రారంభం అయినా ఓంకార్ ‘sixth సెన్స్’ సీజన్ 5 లో సాయి ధరమ్ తేజ్ మరియు సంయుక్త మీనన్ తో పాటుగా పాల్గొన్నది.
ఆడియన్స్ చూపు మొత్తం ఈమె మీదనే ఉంది, ఎవరు ఈ అమ్మాయి, చాలా చలాకీగా ఉందే, అందంగా కూడా ఉంది అని మాట్లాడుకున్నారు.ఈమె సోషల్ మీడియా ని అనుసరించే వారికి దాదాపుగా తెలిసే ఉంటుంది.కానీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మొత్తానికి ఈమె పెద్దగా తెలియదు అనే చెప్పాలి. కానీ ఈ ‘విరూపాక్ష’ సినిమాతో ఆమె కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమైంది.
ఈ సినిమాకి ముందు ఆమె యూట్యూబ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా బాగా ఫేమస్ అయ్యింది.యూట్యూబ్ లో మంచి వ్యూస్ ని దక్కించుకున్న ‘హే పిల్లా’ అనే షార్ట్ ఫిలిం ద్వారా ఈమె మంచి పాపులారిటీ ని దక్కించుకుంది.ఆ తర్వాత ఈమె చేసిన ‘ఓయ్ పద్మావతి’, ‘పెళ్ళైన కొత్తలో’,’రౌడీ బేబీ’ వంటి షార్ట్ ఫిలిమ్స్ లో నటించి మంచి క్రేజ్ ని దక్కించుకుంది.ముఖ్యంగా ఈమె మాట్లాడే డబుల్ మీనింగ్ డైలాగ్స్ కి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. మాస్ యాటిట్యూడ్ తో తనకంటూ సోషల్ మీడియా లో ఒక పెద్ద ఆర్మీ ని ఏర్పర్చుకుంది ఈ అమ్మాయి.

అలా వచ్చిన పాపులారిటీ తో ఈటీవీ లో ప్రసారమైన ‘యమలీల : మళ్ళీ మొదలైంది’ అనే టీవీ సీరియల్ లో మెయిన్ హీరోయిన్ గా నటించే ఛాన్స్ సంపాదించింది.ఆ సీరియల్ పెద్ద హిట్ అవ్వడం తో ఈమె డైరెక్టర్ కార్తీక్ దండు దృష్టిలో పడింది.వెంటనే విరూపాక్ష చిత్రం లో అవకాశం ఇచ్చాడు, సినిమా గ్రాండ్ హిట్ అయ్యింది, ఈ రౌడీ బేబీ కి కూడా మంచి పేరు వచ్చింది.రాబొయ్యే రోజుల్లో ఈమె ఏ రేంజ్ కి వెళ్తుందో చూడాలి.