Akira Nandan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలుగు ప్రజలు ఎలా ఊగిపోతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఆయన పేరు వినిపిస్తే చాలు వాతావరణం మొత్తం వేడిక్కిపోతాది..అలాంటి క్రేజ్ ఉన్న స్టార్ సౌత్ ఇండియా లో ఒక్కరు కూడా లేరు..అలాంటి స్టార్ కి సమనించిన ఏ చిన్న విషయం సోషల్ మీడియా లో వచ్చినా నిమిషాల వ్యవధిలోనే వైరల్ అయిపోతుంది..గుడ్ న్యూస్ అయితే పండగ చేసుకుంటారు..బ్యాడ్ న్యూస్ అయితే సోషల్ నిరసనలతో హోరెత్తిస్తారు.

అలాంటి క్రేజ్ ఉన్న హీరో కొడుకు సినిమాల్లోకి వస్తున్నాడు అంటే యుఫోరియా ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేము..మొదటి రోజు ఓపెనింగ్స్ స్టార్ హీరో రేంజ్ లోనే ఉంటాయి..పైగా అకిరా నందన్ చూడడానికి హాలీవుడ్ హీరో లాగ భారీ కటౌట్ తో ఉన్నాడు..చాలా ఆకర్షణీయంగా కూడా ఉన్నాడు..అతని వర్కౌట్స్ కి సంబంధించిన వీడియోస్ మరియు కర్ర సాము వీడియోస్ సోషల్ మీడియా లో ఏ రేంజ్ వైరల్ అయ్యిందో అందరికి తెలిసిందే.
అకిరా నందన్ సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడు అని అడిగిన ప్రతీసారి రేణు దేశాయ్ అకిరా కి మ్యూజిక్ అంటేనే ఇష్టం..యాక్టింగ్ మీద ఆసక్తి లేదు అంటూ చెప్పుకుంటూ వచ్చింది..కానీ లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ఏమిటి అంటే అకిరా నందన్ మొదటి సినిమా వచ్చే ఏడాది లోనే ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది..ఇందుకోసం పవన్ కళ్యాణ్ ఒక కథ ని కూడా ప్రముఖ టాలీవుడ్ టాప్ డైరెక్టర్ తో సిద్ధం చేయించాడు అట..అతను మరెవరో కాదు..పవన్ కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్.

ఈయన పవర్ స్టార్ కి జల్సా మరియు అత్తారింటికి దారేది వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చినప్పటికీ ‘అజ్ఞాతవాసి’ వంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ కూడా ఇచ్చాడు..అజ్ఞాతవాసి చిత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒక పీడకల లాంటిది..ఆ సినిమా వచ్చినప్పటి నుండి త్రివిక్రమ్ అంటేనే వాళ్ళు మండిపడుతున్నారు..అలాంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ అకిరా మొదటి సినిమా కి దర్శకుడు అంటే ఫ్యాన్స్ తీసుకోలేకపోతున్నారు..మరోసారి నమ్మి మోసపోవద్దు అంటూ పవన్ కళ్యాణ్ ని ట్యాగ్ చేసి అడుగుతున్నారు ఫ్యాన్స్.