Chalapathi Rao : కైకాల సత్యనారాయణ మృతి వార్త మర్చిపోక ముందే మరొక మరణం సంభవించింది. నటుడు చలపతిరావు ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. గుండెపోటుకు గురైన చలపతిరావు తుదిశ్వాస విడిచారు. చలపతిరావు మరణాన్ని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. 78 ఏళ్ల చలపతిరావు కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో చలపతిరావు సినిమాల నుండి విరామం తీసుకున్నారు.

కృష్ణాజిల్లా బల్లిపర్రు లో 1944 మే 8న చలపతిరావు జన్మించారు. చెన్నై వెళ్లి సినిమా ప్రయత్నాలు చేశారు. ఆరడుగుల ఆజానుబాహుడైన చలపతిరావు విలన్ గా సెటిల్ అయ్యారు. కృష్ణ హీరోగా 1966 లో విడుదలైన గూఢచారి 116 మూవీతో చలపతిరావు వెండితెరకు పరిచయమయ్యారు. సుదీర్ఘ కెరీర్ లో 1200లకు పైగా చిత్రాలలో చలపతిరావు నటించారు. మొదట్లో విలన్ రోల్స్ చేసిన చలపతిరావు అనంతరం కమెడియన్,క్యారెక్టర్ రోల్స్ కూడా చేశారు.
చలపతిరావు కుమారుడు రవిబాబు నటుడిగా, దర్శకుడిగా పరిశ్రమలో కొనసాగుతున్నారు. చలపతిరావు మృతి వార్త తెలిసిన చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. ఈ ఏడాది కృష్ణంరాజు, కృష్ణ, కైకాల, చలపతిరావు వరుసగా సీనియర్ నటులు కన్నుమూశారు.
కృష్ణాజిల్లా బల్లిపర్రు లో 1944 మే 8న చలపతిరావు జన్మించారు. నాన్న పేరు మణియ్య, అమ్మ వియ్యమ్మ ది పక్కనే మామిళ్లపల్లి. చలపతిరావు తండ్రి ఆయనను ఉన్నత చదువులు చదివించాలని ఆశపడ్డారు. అయితే ఆయనకు చదువు వంటబట్టలేదు. నాటకాల్లో చలపతిరావు ప్రతిభను చూసి స్నేహితులు సినిమాల్లో ట్రై చేయమని సలహా ఇచ్చారు. చెన్నై వెళ్లి సినిమా ప్రయత్నాలు చేశారు. ఆరడుగుల ఆజానుబాహుడైన చలపతిరావు విలన్ గా సెటిల్ అయ్యారు. కృష్ణ హీరోగా 1966 లో విడుదలైన గూఢచారి 116 మూవీతో చలపతిరావు వెండితెరకు పరిచయమయ్యారు. సుదీర్ఘ కెరీర్ లో 1200లకు పైగా చిత్రాల్లో చలపతిరావు నటించారు. మొదట్లో విలన్ రోల్స్ చేసిన చలపతిరావు అనంతరం కమెడియన్,క్యారెక్టర్ రోల్స్ కూడా చేశారు. రేప్ సీన్స్ కి చలపతిరావు పిచ్చ ఫేమస్. ఆ తరహా సీన్స్ కి చలపతిరావును దర్శకులు ఎంచుకునేవారు. డైలాగ్ డెలివరీలో చలపతిరావు విలక్షణత కలిగి ఉండేవారు.

చలపతిరావుకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు. కొడుకు రవిబాబు నటుడిగా, దర్శకుడిగా పరిశ్రమలో కొనసాగుతున్నారు. చలపతిరావు మృతి వార్త తెలిసిన చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. ఈ ఏడాది కృష్ణంరాజు, కృష్ణ, కైకాల, చలపతిరావు వరుసగా సీనియర్ నటులు కన్నుమూశారు. ఒకే ఏడాది నలుగురు సీనియర్ నటులను కోల్పోవడం ఊహించని పరిణామం. కైకాల చితి మంటలు ఆరకముందే, చలపతిరావు చిత్ర పరిశ్రమను వదిలిపోయారు.