https://oktelugu.com/

AGENT Teaser Talk : హాలీవుడ్ రేంజ్ లో ‘ఏజెంట్’ అఖిల్ సాహసాలు..

Akhil Akkineni AGENT Teaser Talk : ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ఫ్యామిలీ తర్వాత ఏఎన్ఆర్ ఫ్యామిలీనే నంబర్ 2. ఇప్పుడు మెగా స్టార్ చిరంజీవి అగ్రస్థానంలో ఉంటే అక్కినేని నాగార్జున టాప్ 4లో ఉన్నారు. నాగార్జున వారసత్వం మాత్రం ఇప్పటికీ స్టార్ లుగా ఎదిగేందుకు కష్టపడుతోంది. నాగార్జున మొదటి కొడుకు నాగచైతన్య ఒక హిట్టూ.. రెండూ ఫ్లాపులతో సాగుతుండగా.. రెండో కుమారుడు బ్లాక్ బస్టర్ హిట్ కోసం కాస్త గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఈ […]

Written By: , Updated On : July 15, 2022 / 07:05 PM IST
Follow us on

Akhil Akkineni AGENT Teaser Talk : ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ఫ్యామిలీ తర్వాత ఏఎన్ఆర్ ఫ్యామిలీనే నంబర్ 2. ఇప్పుడు మెగా స్టార్ చిరంజీవి అగ్రస్థానంలో ఉంటే అక్కినేని నాగార్జున టాప్ 4లో ఉన్నారు. నాగార్జున వారసత్వం మాత్రం ఇప్పటికీ స్టార్ లుగా ఎదిగేందుకు కష్టపడుతోంది. నాగార్జున మొదటి కొడుకు నాగచైతన్య ఒక హిట్టూ.. రెండూ ఫ్లాపులతో సాగుతుండగా.. రెండో కుమారుడు బ్లాక్ బస్టర్ హిట్ కోసం కాస్త గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.

ఈ క్రమంలోనే టాలీవుడ్ లోనే ఎన్నో హిట్ చిత్రాలు తీసిన తనేంటో నిరూపించుకున్న స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తన కొత్త చిత్రాన్ని అఖిల్ హీరోగా తీస్తున్నాడు.. అదే ‘ఏజెంట్’. అఖిల్ ను హీరోగా పెట్టి ఏకంగా ప్యాన్ ఇండియా లెవల్ లో ఈ చిత్రాన్ని తీస్తున్నాడు. ఇందుకోసం అఖిల్ ఏకంగా సిక్స్ ప్యాక్ కండలు పెంచి వీరోచితంగా తయారయ్యాడు. అదిరిపోయే లుక్ లోకి మారాడు. ఏజెంట్ కోసం అఖిల్ పడిన తపన అంతా తాజాగా విడుదల చేసిన మూవీ ట్రైలర్ లో కనిపించింది.

ఈరోజు ‘ఏజెంట్’ మూవీ ట్రైలర్ విడుదలైంది. ఇందులో అఖిల్ విశ్వరూపమే చూపించాడు. ఏకంగా ప్యాన్ ఇండియా లెవల్ లో హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం రిలీజ్ అవుతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. మొత్తం ఇంగ్లీష్ డైలాగులతోనే ట్రైలర్ ను నింపారు. తెలుగులోనే బ్రేక్ తెచ్చుకోలేకపోయిన అఖిల్ ను పెట్టి ఏకంగా ప్యాన్ ఇండియా సినిమా తీసిన సురేందర్ రెడ్డి గట్స్ కు హ్యాట్సాఫ్ చెప్పాలి.

ఇక ట్రైలర్ చూస్తే మైండ్ బ్లోయింగ్ గా ఉంది. మలయాళ సీనియర్ హీరో మమ్ముట్టి ఎంట్రీతో వచ్చిన ట్రైలర్ లో అఖిల్ ఎమోషన్, ఫైటింగ్, క్లైమాక్స్ సన్నివేశాలు అదిరిపోయేలా తీర్చిదిద్దారు.మిషన్ గన్ పట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఫైట్ చేస్తున్న అఖిల్ నటన అదరిపోయిందనే చెప్పాలి. అఖిల్ కొత్త లుక్ చాలా వైల్డ్ గా ఉంది. అఖిల్‌ కు జంటగా సాక్షి వైద్య నటిస్తుంది.

‘ఏజెంట్’గా పనిచేస్తున్న అఖిల్.. ఏదో ఆశయం కోసం విదేశాలకు వెళ్లడం.. అక్కడ శత్రు సంహారం..అమ్మాయితో ప్రేమ.. చివరకు అష్టకష్టాలు పడి దాన్ని సాధించడమే ధ్యేయంగా ‘ఏజెంట్’ సాహసాలతో ట్రైలర్ ను నింపేశారు.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ తర్వాత అఖిల్ నుంచి వచ్చిన ఈ చిత్రం ట్రైలర్ అచ్చం హాలీవుడ్ సినిమాను తలపిస్తోంది. ఆద్యంతం గూస్ బాంబ్స్ తెప్పించేలా ఉంది. ఆ ట్రైలర్ ను మీరూ చూసి ఎంజాయ్ చేయండి..

AGENT Teaser | Akhil Akkineni, Mammootty | Surender Reddy | Anil Sunkara