
Ajmer: ఇటీవల కాలంలో ప్రేమికులు బరితెగిస్తున్నారు. నలుగురు ఉన్నారనే కనీస పట్టింపులు లేకుండా పోతున్నాయి. నడిబజారే నాలుగు గోడలుగా అనుకుంటున్నారు. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అని భావిస్తున్నారు. ప్రేమ జంటలు విచ్చలవిడిగా తెగిస్తున్నారు. మొన్న చత్తీస్ గడ్, నిన్న విశాఖపట్నం, నేడు రాజస్తాన్ ఒక చోట కాకుండా దేశంలోని పలు ప్రాంతాల్లో రెచ్చిపోతున్నారు. అందరి ముందరే సిగ్గు విడిచి ప్రవర్తిస్తున్నారు. బైక్ మీద ఎదురెదురుగా కూర్చుని ముద్దుల వర్షం కురిపించుకుంటూ వెళ్లడంతో చూసే వారు నివ్వెరపోతున్నారు. ఇదేం చోద్యం రా బాబూ అని నిట్టూరుస్తున్నారు. బైక్ పై ప్రమాదకర రీతిలో కూర్చుని వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
రాజస్తాన్ లోని అజ్మీర్ లో..
రాజస్తాన్ లోని అజ్మీర్ లో కాలేజ్ క్రాస్ రోడ్డు నౌసర్ వ్యాలీ రహదారిపై ఓ ప్రేమ జంట చేసిన వికృత చేష్టలు అయోమయానికి గురి చేశాయి. నడిరోడ్డుపై వెళ్తున్న వారు వారిని చూసి అవాక్కయ్యారు. వారిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. ఈ జంట చేస్తున్న వ్యవహారంపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు స్పందించి వారిపై కేసు నమోదు చేశారు. బైక్ ను స్వాధీనం చేసుకుని వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు.
విచ్చలవిడిగా..
ఈ మధ్య కాలంలో మరీ బరితెగిస్తున్నారు. రోడ్డుపైనే విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. రోడ్డుపై వాహనదారులకు అడ్డంకులు సృష్టించే తతంగంపై దృష్టి సారిస్తున్నారు. ఈ తరహా సంఘటనలు పునరావృతం కావడంతో అందరిలో ఆందోళనలు నెలకొంటున్నాయి. ఒకరిని చూసి మరొకరు వరుస ఘటనలు జరగడంతో ఏం చేయాలనే దానిపై పోలీసులు ఆలోచనలో పడుతున్నారు. ప్రేమ పేరుతో జంటలు చేసే వికృత చేష్టలు మరికొందరికి మార్గం చూపుతున్నాయి. వారు చేస్తే ఏం చేశారనే కోణంలో ఆలోచిస్తూ ఇలా చేయడం గమనార్హం.
వరుస ఘటనలతో..
ఇలాంటి సంఘటనలు సామాజిక మాధ్యమాల్లో మరింత వైరల్ గా చేస్తున్నారు. దీంతో ఒకరి వెంట మరొకరు అన్నట్లుగా వరుస ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీనిపై కఠిన శిక్షలు ఉండకపోవడంతో లవర్స్ రెచ్చిపోయి పిచ్చివారిలా చేస్తున్నారు. ద్విచక్ర వాహనాల పైనే కూర్చుని సరసాలు చేసుకుంటున్నారు. పబ్లిక్ ప్లేస్ అనే ధోరణి వారిలో కనిపించడం లేదు. వారి కంటికి ఎవరు కనిపించడం లేదు. మేమే ఒంటరిగా వెళ్తున్నామనే ఫీలింగ్ లో వారు ఉండటం ఆందోళనలకు తావిస్తోంది.

వీటికి ముగింపు లేదా?
ఇలాంటి వ్యవహారాల్లో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నా ప్రేమికుల తీరు మారడం లేదు. బైకులనే సోఫాలుగా చేసుకుంటున్నారు. వాహనదారులకు ఆటంకాలు కలిగించడం శ్రేయస్కరం కాదని తెలిసినా నిర్లక్ష్యంగానే వెళ్తున్నారు. ఇవి మరోమారు పునరావృతం కాకుండా చూడాలని పలువురు వేడుకుంటున్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా వారి ప్రవర్తన ఉంటోంది. ఈ నేపథ్యంలో ప్రేమికుల భరతం పట్టి వారిని గాడిలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
अजमेर के पुष्कर रोड पर बाइक पर आशिकी, वीडियो वायरल#ajmer #ajmerviralvideo @AjmerpoliceR pic.twitter.com/aQCiumXilZ
— Jyoti Sharma (@JyotiSh61024918) February 7, 2023