Mark Zuckerberg And Steve Jobs: మన దేశంలోని ఈ హిమాలయ ఆలయంలో పూజలు చేశాకే కుబేరులైన స్టీవ్ జాబ్స్, జుకర్ బర్గ్

2015 లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఆయనను ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జూకర్ బర్గ్ కలిశారు. ఈ సందర్భంగా భారతదేశంతో తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.

Written By: Suresh, Updated On : February 13, 2024 5:11 pm
Follow us on

Mark Zuckerberg And Steve Jobs: జూకర్ బర్గ్, స్టీవ్ జాబ్స్.. వీరేమీ సాధారణ వ్యక్తులు కాదు. ఒకరు ఫేస్ బుక్ ను ఆవిష్కరించి సామాజిక మాధ్యమాలలో సరికొత్త చరిత్ర సృష్టించారు. మరొకరు యాపిల్ అనే బ్రాండ్ ను సృష్టించారు. కేవలం ఈ రెండు సంస్థల కింద లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. పరోక్షంగా అంతే మంది ఉపాధి పొందుతున్నారు. ఇంగ్లీష్ మూలాలు కలిగి ఉన్న వీరు క్రైస్తవ మతాన్ని ఆచరిస్తారు. క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. అలాంటి వీరు ఆలయాన్ని సందర్శించారంటే నమ్ముతారా? సరే విదేశీ పర్యటనల్లో భాగంగా తమ మార్కెటింగ్ కు అనుకూలంగా ఉంటుంది కాబట్టి అలా చేస్తారనుకుందాం. కానీ ఒక గుడిని దర్శించిన తర్వాత వీరు ఆగర్భ శ్రీమంతులయ్యారంటే.. చదువుతుంటే ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదూ.. కానీ ముమ్మాటికి నిజం. ఈ విషయాన్ని వారే స్వయంగా ఒప్పుకున్నారు.

2015 లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఆయనను ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జూకర్ బర్గ్ కలిశారు. ఈ సందర్భంగా భారతదేశంతో తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఈ క్రమంలో ఒక ఆలయం గురించి నరేంద్ర మోడీతో ప్రముఖంగా ప్రస్తావించారు. “యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ సూచన మేరకు నేను భారతదేశానికి వచ్చాను. ఒక ఆలయాన్ని సందర్శించాను. ఆ ఆలయ సందర్శన తర్వాత నా జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి.” అని జూకర్ బర్గ్ నరేంద్ర మోడీతో పేర్కొన్నారు.

జూకర్ బర్గ్ ఆ సమయంలో సందర్శించిన ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ఆ రాష్ట్రంలోని నైనిటాల్ ప్రాంతంలోని కైంచి ధామ్ అనే ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఇదే ఆలయాన్ని 1970లో యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ సందర్శించారు. ఈ ఆలయాన్ని సందర్శించిన తర్వాతనే స్టీవ్ జాబ్స్ యాపిల్ కంపెనీని నెలకొల్పారని ఆయన సన్నిహిత వర్గాలు ఉంటాయి..కైంచి ధామ్ అనేది నైనిటాల్ ప్రాంతంలోని బాబా నీం కరోలి ఆశ్రమం. దీనిని 1960లో నీమ్ కరోలి బాబా నిర్మించినట్టు అక్కడి స్థానికులు చెబుతుంటారు. ఆశ్రమం చుట్టూ కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. అక్కడికి వెళ్ళగానే ఎంతో ప్రశాంతత లభిస్తుంది. 1973లో బాబా మరణించారు. అయినప్పటికీ ఇతర దేశాలకు చెందిన వారు ఆయనను విశ్వసిస్తూ ఉంటారు. ఆయన అక్కడి ఆలయంలో కొలువై ఉన్నారని నమ్ముతుంటారు. ముఖ్యంగా ప్రతి ఏటా అమెరికన్లు ఈ ఆలయానికి లక్షల్లో వస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం జూన్ 15న ఇక్కడ భారీగా జాతర జరుగుతూ ఉంటుంది. ఈ జాతరలో పాల్గొనేందుకు స్థానికులతో పాటు విదేశీయులు కూడా వస్తూ ఉంటారు.

ఫేస్ బుక్ ఏర్పాటు చేసే ముందు స్టీవ్ జాబ్స్ సూచన మేరకు జూకర్బర్గ్ 2015లో ఈ ఆలయాన్ని సందర్శించారు. ఆయన ఆలయాన్ని సందర్శించినప్పుడు ఉత్తరాఖండ్ ప్రాంతంలో తుఫాన్ ఏర్పడి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బయటికి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఆయన రెండు రోజులపాటు ఆశ్రమంలోనే బస చేయాల్సి వచ్చింది. ఈ ఆలయాన్ని సందర్శించిన తర్వాత తన వ్యాపారం ముఖచిత్రం పూర్తిగా మారిపోయిందని అప్పట్లో జూకర్ బర్గ్ నరేంద్ర మోడీతో అన్నారు. జూకర్ బర్గ్, గతంలో స్టీవ్ జాబ్స్ మాత్రమే కాకుండా చాలామంది అమెరికన్లు ఈ ఆలయాన్ని సందర్శించేందుకు వస్తూ ఉంటారు. వారిలో పేరు మోసిన రాజకీయ నాయకుల నుంచి వ్యాపారవేత్తల వరకు ఉంటారని అక్కడ ఆలయ వర్గాలు చెబుతున్నాయి.